Tuesday, 19 May 2026

21 నుండి ఏఐపై ఉచిత శిక్షణ

 21 నుండి ఏఐపై ,ఎమర్జింగ్ టెక్నాలజీ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఏఐ ,ఎమర్జింగ్ టెక్నాలజీలు, స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలలో నాలుగు రోజుల పటు సదస్సులు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

ఈనెల 21 నుండి జూన్ 11 వరకు జిల్లాలలో కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ ప్రధాన కార్యాలయంలో ఈనెల 21 నుంచి 26 వరకు సదస్సు ఉంటుందని ఆయన వివరించారు. జిల్లాల వారీగా షెడ్యూల్ను ప్రకటించామని 12 జిల్లాల్లోని స్టడీ సర్కిల్లోఇవి కొనసాగుతాయన్నారు.

ఉచితంగా మామిడి మొక్కల పంపిణీ

 వేసవి అనగానే మనకు టక్కున గుర్తు వచ్చేవి మామిడి పండ్లు. అందరూ పండ్లను తిన్న తర్వాత టెంకలను బయటపడేస్తుంటారు. అయితే బయటపడవేసే ఈ టెంకలను సేకరిస్తూ రైతులకు ఆదాయ మార్గాన్ని చూపుతున్నాడు కోల్ కతా కు చెందిన జస్మిత్ సింగ్. వైద్య శాస్త్రం చదివిన ఆయన , ఆంత్ర ప్రేన్యూర్ గా కూడా పని చేసిన ఆయనను నీరు లేక వరి పొలాలు ఎండిపోయి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్న కొన్ని సంఘటనలు కలచి వేసాయి. అప్పుడే నీటి అవసరం ఎక్కువగా లేని ఎక్కువ కాలం ఆదాయం పొందే దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. అలా వచ్చింది మామిడి టెంక లను సేకరించాలనే ఒక ఆలోచన.



దాంతో ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో  "మామిడి టెంకలను పారేయకండి, వాటిని శుభ్రంగా కడిగి ఎండబెట్టాక నాకు  పంపించండి "అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నుండో పార్శిల్ల ద్వారా వచ్చిన టెంకలను దీని కోసమే సొంతంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలుగా పెంచుతున్నాడు .ఆ తర్వాత వాటిని " రైతులకు ఉచితంగా "పంచుతున్నాడు. అవి పెరిగి పెద్దయ్యాక రైతులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు పచ్చదనం పెంపొంది పర్యావరణానికి మేలు జరుగుతుందని అంటారు డాక్టర్ జస్మిత్ సింగ్.


నిరాశ్రయులకు ఉచిత వసతి

 వృద్ధాప్యంలో పిల్లలు చూడకపోవడం,అనారోగ్యం,పేదరికం తదితర కారణాలతో ఎంతోమంది నిరాదరణకు గురై వీధి పలు అవుతున్నారు. అలాంటి నిస్సహాయులను ఆదుకునేందుకు ప్రారంభించిన సంస్థ శ్రీ గౌతమీ జీవ కారుణ్య సంఘం.. అనాధల సేవనే భగవంతుడు సేవ అని భావించిన కారుణ్యానంద స్వామీజీ దాదాపు 86 ఏళ్ల క్రితం రాజమండ్రిలో ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. నాటి నుంచి నిరాదైనా నాకు గురైన వారికి కుష్టి రోగులకు ఆశ్రయం కల్పిస్తూ అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు.



పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ ఆటలు పాటలు నేర్పిస్తూ మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సంస్థను పెట్టిన స్వామీజీ మరణించడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సంస్థ బాధ్యతలను తీసుకున్నది.

మా సంస్థలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఎవరైనా చనిపోయి ,వారి సంబంధికులు రాకపోతే మేమే అంత్యక్రియలు నిర్వహిస్తాము అని అన్నారు సంస్థ కార్య నిర్వహణ అధికారి బాధ్యతలు చూస్తున్న పితాని తారకేశ్వర రావు.

బధిరులకు ఉచితంగా

 బదిరులకు చదువుతోపాటు అన్ని రకాల నైపుణ్యాలను ఉచితంగా నేర్పించి తీర్చిదిద్దే సరస్వతి నిలయం నాగుబడి రంగయ్య అచ్చమ్మ బదిరుల పాఠశాల. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని నాగులపాలెం గ్రామంలో ఉన్న ఈ పాఠశాలను ప్రవాసాంధ్రుడైన డా.నాగుబడి సుబ్బారావు గారు నిర్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వైద్య విద్య చదివి అమెరికాలో యూరాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరి బధిరురాలు . ఆమెలాంటి వారికి ఉపయోగపడేలా ఏదైనా చేయమని తండ్రి కోరడంతో 18 కోట్ల రూపాయలు హెచ్చించి ఈ పాఠశాలను స్థాపించారు.



అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వాళ్లకు విద్యతోపాటు వసతి ,పుస్తకాలు ,దుస్తులు ఇలా అన్నింటినీ అందిస్తుంది ఈ స్కూలు ట్రస్ట్.చదువుతో పాటు కుట్టుపని , సబ్బులు, చాక్ పీస్ ల తయారీని నేర్పిస్తూ ఆటలలోనూ ప్రోత్సహిస్తున్నారు..

ప్రతి నెలా ఉచితంగా బియ్యం..

 ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో ఉన్న విద్యా హై స్కూల్ లో సోమవారం "రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ" అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా పేదలకు "ఉచితంగా బియ్యం పంపిణీ"చేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలా నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.మొత్తం 65 మంది పేద వృద్ధులకు బియ్యం అంద చేశామన్నారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ ఖాన్దేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్,ఉపాధ్యక్షులు జిందం నరహరి , S g శ్రీకాంత్, గోనె శ్రీధర్,తులసి పట్వారీ, ఖాన్దేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

Monday, 18 May 2026

అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి బీహార్

 బీహార్ లోని సరాన్ జిల్లాలో ఆదివారం కంటి ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదాని హాజరయ్యారు .సరౌన్ జిల్లా కేంద్రం శివారులలో 150 కోట్ల రూపాయల మేరకు ఆదాని ఫౌండేషన్ సహాయంతో భారీ స్థాయిలో ఇక్కడ అఖండ జ్యోతి కంటి ఆసుపత్రి నిర్మాణానికి తలపెట్టారు .ఇక్కడి మస్తీ చాకులో ఆసుపత్రి పూర్తి అయితే వార్షికంగా మూడు లక్షలకు పైగా  కంటి ఆపరేషన్లు జరుగుతాయి. వేయి మంది కంటి వైద్యులకు అవసరమైన అధునాతన శిక్షణ అందుతుంది .శంకుస్థాపన కార్యక్రమానికి  ఆదాని, ఆయన భార్య అదానీ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రీతి ఆదానీ హాజరయ్యారు. కార్యక్రమం నేపథ్యంలో ఆదాన్ని దంపతులు మాట్లాడారు తాము సేవనే ధర్మంగా పరిగణిస్తామని ప్రకటించారు .మొత్తం మీద ఇక్కడ ఆసుపత్రికి 500 కోట్ల రూపాయల మేర వ్యక్తిగత సహాయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా తాము చేపట్టబోయే దీర్ఘకాలిక మానవీయ, సామాజిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల దిశలో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా గౌతమ్ ఆదనీ తెలిపారు.

ఉచితంగా చల్లని మజ్జిగ@హైద్రాబాద్

 ఎండలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నమో వందే గోమాతరం మరియు వరల్డ్ హిందూ లయన్స్ ఫౌండర్ పెరిక సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు వేలాదిమందికి ఉచితంగా చల్లని మజ్జిగ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 



మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...