Sunday, 31 May 2026

ముత్తూట్ ఫైనాన్స్ ఉచిత వైద్య శిబిరం

 


ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముగల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి అన్నారు. శనివారం భీంగల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. శిబిరం రీజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు దళిత శిబిరం ఏర్పాటు చేసిన ఫైనాన్సువారికి పట్టణ ప్రజల తరఫున చైర్మన్ మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతోటి ఫైనాన్స్ వారు ఆధ్వర్యంలో చైర్మన్ దంపతులకు శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్ సిబ్బంది వినయ్ ,విగ్నేష్ , వర్ష తదితరులు పాల్గొన్నారు.



సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్

 డాక్టర్ మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వారం రోజుల ఉచిత ఓరియంటషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది .జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు .ప్రతిరోజు మూడు గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు. పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక ,వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు,కెరీర్ మార్గదర్శకత్వం పై ప్రధానంగా శిక్షణ అందిస్తారు. "శిక్షణ మాత్రమే ఉచితంగా "ఉంటుంది. బస ,భోజన సదుపాయాలు అభ్యర్థులే  ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది .ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు మెయిల్ చేయాలి.

Saturday, 30 May 2026

ఫ్రీ ఏ ఐ మాస్టర్ క్లాస్

 


ఫ్రీ ఏ ఐ మాస్టర్ క్లాస్,31-5-2026



https://avinashmada.com/master-ai-future-proof-your-career?gc_id=23099904886&h_ga_id=187190195992&h_ad_id=777968169499&h_keyword_id=&h_keyword=&h_placement=&utm_source=Google&utm_medium=Free+|+Image+|+Telangana+|+BT+|+Group3+|+25to40&utm_campaign=TF+|+AM+|+Free+|+Image+|+Telangana+|+camp3+|+8Oct25&utm_content=Img8+Still+don%E2%80%99t+know&gad_source=2&gad_campaignid=23099904886&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-UC9xKyeOYo-o9C2u720ghmpcvK-qLO-gauLrYqGuL58F6aYkKdbt4aAnDOEALw_wcB



14 రోజులు ఫ్రీ యోగా క్లాసులు

 



వచ్చే సోమవారం నుండి అంటే జూన్ 1వ తారీకు నుండి ఆన్లైన్లో ఉచితంగా యోగ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కలిగిన వారు ఈ యోగ క్లాసులో ఉచితంగా జాయిన్ అయి యోగ సాధన చేయవచ్చు. ఇప్పటికే ఎంతోమంది ఈ ఉచిత యోగా క్లాసులను వినియోగించుకుంటున్నారు ఈ యోగా క్లాసులో జాయిన్ కావాలంటే ఈ కింది లింక్ లో మీ వివరాలు నమోదు చేసుకుంటే వాట్సప్ కు ప్రతిరోజు యోగా షెడ్యూల్ వస్తుంది.


https://yoga.healthyday.co.in/telugu/?ref=GAds_SC1_LA1LA2_RmVlgReBa_ResrDSE7D_MntrHK2telTrmdV3_SplitViewtelV2_ResrTerPl_13APR26&gad_source=2&gad_campaignid=23282412477&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-W9s4ridJ_hHqntsoKy4WMpAD09h69hK5WApZW55gzSKauEI_DJPHwaAgb6EALw_wcB




https://yoga.healthyday.co.in/telugu/?ref=GAds_SC1_LA1LA2_RmVlgReBa_ResrDSE7D_MntrHK2telTrmdV3_SplitViewtelV2_ResrTerPl_13APR26&gad_source=2&gad_campaignid=23282412477&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-W9s4ridJ_hHqntsoKy4WMpAD09h69hK5WApZW55gzSKauEI_DJPHwaAgb6EALw_wcB





Wednesday, 27 May 2026

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





ఉచితంగా స్టీల్ బాక్స్ ల పంపి

 లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ బాక్సులు గ్లాసులకు బదులుగా స్టీల్ గ్లాసులు ,స్టీల్ బాక్సులు వాడాలని గ్రామస్తులకు స్టీల్ బాక్సులు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. హోటల్స్ నిర్వాహకులకు గాజు గ్లాసులు వాడాలని వారికి గ్లాసులను పంపిణీ చేశారు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఉప సర్పంచ్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.

ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 భిక్కనూరు మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు వైద్యుడు నవీన్ సాయి ఫిజియోథెరపీ చికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తే మానసిక ఉపేశమానం కలుగుతుందన్నారు. ప్రతి మంగళ, గురువారం భవిత కేంద్రంలో ఈ ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఆర్పి మహేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...