కామారెడ్డి జిల్లాలోని గర్గోలు గ్రామంలో పీపుల్ ఫర్ ఇండియా ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది శిక్షణ పొందిన వారికి ద్రోపత్రాలను సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ అందించారు విద్యార్థినిలకు ఐదు కుట్టుమిషన్లు మగ్గం పరికరాలు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ స్రవంతి ఎన్జీవో అందిస్తున్న సేవలను అభినందించాలి కార్యక్రమంలో ఏసీజీ బలరాం ఎంఈవోలు ఎల్లయ్య ఆనందరావు శిక్షకులు నవీన్ చైతన్య లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Saturday, 6 June 2026
ఉచిత స్టీల్ ప్లేట్ల పంపిణీ
బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన తపస్సు జిల్లా అధ్యక్షుడు బోనీకర్ సంతోష్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి ఉపయోగపడేలా 100 స్టీల్ ప్లేట్లను గ్రామ సర్పంచ్ భూమిక జ్యోతి కి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగే శుభకార్యాలు సామాజిక కార్యక్రమాలకు ఈ ఉచిత స్టీల్ ప్లేట్లను వినియోగించాలన్నారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ దోహదపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలను సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు సేవా కార్యక్రమాలు మరిన్ని మున్ముందు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామస్వామి జయ వీరప్ప డాక్టర్ రవి కమార్ సంతోష్ పటేల్ గాండ్ల శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.
కరక్ వాడిలో మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో కరక్ వాడి అనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ వైద్య బృందం గ్రామ ప్రజలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మరియు ఆరోగ్య సమస్యలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందించింది. రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు ,కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత సమస్యలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. అవసరమైన వారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మెరుగైన చికిత్స అవసరమైన రోగులను మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేద మరియు గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, పలమనాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, నర్సింగ్ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 300 మందికి పైగా గ్రామస్తులు వైద్య సేవలను వినియోగించుకుని లబ్ధి పొందారు.
సంస్కృత భాష పై ఉచిత అవగాహన శిబిరం
సంస్కృత భాష పై ప్రాథమిక పరిజ్ఞానం కల్పించడానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారి ఆధ్వర్యంలో ఈ నెల 9 10 మరియు 11 తేదీలలో సరళ సంస్కృత భాష అవగాహన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు శశికాంత్ పులకరిని కార్యదర్శి రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సంస్కృత భాష నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు నోట్ బుక్స్ పెన్నులు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు శిక్షణ శిబిరం బోర్గాలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు మహిళలు భాషాభిమానులు ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9494 392393 ఫోన్ నెంబర్లో సంప్రదించాల్సిన సూచించారు.
మరోసారి 300 మందికి ఉచిత వీసాలు
యూఏఈ లోని ADNH, స్థానిక GTM సంస్థల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ మేళా.. జూన్ 12 న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్, ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ ల నిర్వహణ.
యూఏఈ లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకు యూఏఈ కి చెందిన ADNH, మన దేశానికి చెందిన GTM సంస్థలు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈ నెల 12 తేదీ న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్ ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు.
ఎంపికైన వారికి "ఉచితంగా వీసాలు "ఇచ్చి విమానం ఛార్జీలను సైతం కంపెనీ యే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు 24 వేల రూపాయలు వేతనం చెల్లిస్తూ,నివాసం,భోజనం సదుపాయాలను ADNH కంపెనీ కల్పిస్తుంది.
వివరాల కోసం .. క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి.
సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999 , ఆర్మూర్ 83320 13999 నంబర్ లలో సంప్రదించాలని తెలిపారు.
ఈ సందర్భంగా GTM సంస్థ చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ ఉచిత వీసాలు అందించే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వలస వెళ్ళే వారిపై నయాపైసా భారం పడకుండా అన్ని వసతులు ఉచితంగా కల్పించడం తమ ప్రత్యేకత అని అన్నారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
Friday, 5 June 2026
కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం
మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.
"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..
కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..
రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.
Tuesday, 2 June 2026
ఆత్మ రక్షణ విద్యల్లో. ఉచిత శిక్షణ
కరాటే, కర్రసాము, యోగా.. ఉచిత శిక్షణ
పిల్లలు సెలవులను వృధా చేయకుండా ఆత్మ రక్షణకు తోడ్పడేలా బాన్సువాడ మడలంలో గోజే వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు. స్థానిక ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్ర సాము, యోగ పై శిక్షణ ఇస్తున్నారు. తొలిత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ గోజే వేద్ ఆర్యన్( బ్లాక్ బెల్ట్ )ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే ,యోగ పై ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడు కావడంతో శిబిరం విజయవంతంగా కొనసాగుతోంది.
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...

