నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్ ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటీరియల్ రంజిత్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment