Saturday, 9 May 2026

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

 వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి..సిరికొండలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు నిర్వహించనున్న వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ జి రాజేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 25 వరకు నిర్వహించనున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మండలంలోని పి ఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను 15 రోజులపాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు అయిన వెల్లడించారు. విద్యార్థులకు క్రాఫ్ట్ ,కరాటే ,స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ డ్రాయింగ్, డాన్స్, సంగీతం, యోగ ,ఆటలు, నృత్యం, చిత్రలేఖనం, సృజనాత్మక అభివృద్ధి తదితర అంశాలలో శిక్షణ కొరకు శిక్షణ శిబిరాల నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకునే విద్యార్థులు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల సూచించారు. 9290559309 మరియు 9490771237 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.

ఏర్కెట్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉచిత సమ్మర్ క్యాంప్ ఫోన్ నెంబర్..9848512511

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...