Thursday, 14 May 2026

ఉచిత త్రో బాల్ శిక్షణ శిబిరం

ఈషా గ్రామోత్సవం..ఆటలు,వేడుకలు,పురోగతి



14 ఏళ్ళు మరియు ఆ పైబడిన గ్రామీణ మహిళల కోసం ఉచిత త్రోబాల్ శిక్షణ శిబిరం. సులువైన మరియు ఆసక్తికరమైన పద్ధతిలో ఈ ఆటను నేర్చుకోండి. అనుభవజ్ఞులైన కోతుల వద్ద శిక్షణ పొందవచ్చు. అలాగే ఈశా గ్రామోత్సవం కోసం మీ సొంత  జట్టును ఏర్పాటు చేసుకోండి. పాల్గొని ఐదు లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం పొందండి. 

కొత్త వాళ్లు కూడా సులభమైన పద్ధతిలో త్రో బాల్ నేర్చుకునే అవకాశం ఇది. సరదా ఆటలు వినోద కార్యక్రమాలలో పాల్గొనండి. నిపుణులైన కోచ్ల నుండి ప్రత్యేక శిక్షణ పొందండి. ప్రతిరోజు అల్పాహారం అందించబడుతుంది. ఈషా గ్రామోత్సవం కోసం మీ సొంత జట్టును ఏర్పాటు చేసుకొని పాల్గొని ఐదు లక్షల రూపాయలు బహుమతి పొందే అవకాశం పొందండి.

పరిమిత సీట్లు ..ఇప్పుడే చేరండి..


వేదిక ..సిరిసిల్ల ..రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం

తేదీ ..మే 13 నుండి 17 వరకు 

ఈరోజే రిజిస్టర్ చేసుకోండి..

Isha.co/grm-camp 

మరిన్ని వివరాలకు..8300030999


తేదీ ..మే 20 నుండి 24 వరకు 

వేదిక.. కరీం నగర్, తెలంగాణ.


తేదీ ..మే 27 నుండి 31 వరకు 

వేదిక.. వరంగల్, తెలంగాణ 


తేదీ.. మే 27 నుంచి 31 వరకు 

వేదిక..చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ 


తేదీ ..మే 27 నుంచి 31 వరకు 

వేదిక.. విశాఖ పట్నం , ఆంధ్రప్రదేశ్ 


తేదీ ..మే 18 నుంచి 22 వరకు 

వేదిక .. పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్ 


తేదీ మే 20 నుంచి 24 వరకు 

వేదిక.. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్..


ఉచిత ఆన్లైన్ కోచింగ్.. అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్

 అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించనున్న ఉచిత ఆన్లైన్ కోచింగ్ కోసం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట మోడల్ స్కూల్ ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు .రానున్న మూడేళ్ల పాటు పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అక్షరధాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. దీనితో 8 వ తరగతి విద్యార్థులకు ఎస్ఎంఎస్ పరీక్షల క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.

స్వయం ఉపాధి సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ

 యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలు తెలిపారు రెండు నెలల కాల పరిమితి గల అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ ప్రైమ్ కోర్సు కు బీకాం విద్యార్హత మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ డిజిటల్ మిత్ర కోర్సు కు ఇంటర్మీడియట్ పాస్ అయ ఉండి అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయ ఉండాలన్నారు ఆరు నెలల కాలపరిమితి కలిగిన ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్స్ కు ఐటిఐ విద్యార్హత కంప్యూటర్ హార్డ్వేర్ సిసిటీవీ సెల్ ఫన్ రిపేరింగ్ కోర్సుకు ఎస్ఎస్సి పాస్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి కువైట కువైట్ బ్యాగులు తయారీ కోరుసుక ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కొన్నారు పై కోర్సులకు అభ్యర్థులు 18 నుండి 25 మధ్య వయసు ఉండాలంటే తెలిపారు ఆసక్తి కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు ఆధార్ కుల పత్రం ఫోటోలతో ఈ నెల 18 లోపు సంస్థలు హాజరు కావాలని తెలిపారు.

పుస్తకం చదివితే నగదు బహుమతి

 వేసవి సెలవులు లో విద్యార్థులు మంచి మంచి పుస్తకాలు చదివేలా ప్రోత్సహించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలికలోని శాఖ గ్రంథాలయం వినూత్నంగా ఆలోచించింది గ్రంథాలయంలో ఒకరోజు పేరుతో నెలరోజుల ప్రత్యేక కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది జూన్ 12 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోంది క్రమం తప్పకుండా హాజరై ఎక్కువ గంటలకు పుస్తక పఠనం చేసిన విద్యార్థులలో పది మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు సన్మానం చేస్తామని గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి ప్రకటించారు ఇక్కడ ఒకేసారి 50 మంది వరకు కూర్చుని చదువుకునే అవకాశం 60 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండడం విశేషం.

ఉచిత క్రికెట్ శిక్షణ @ కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది.. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడా అని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి హెచ్సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు . అండర్ 15 అండర్ 19 ఓపెన్ కేట ఏరియాలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా రాష్ట్ర సయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మానసిక ధైర్యాన్ని , ఉజ్వల భవిష్యత్తును అంతిస్తాయని తెలిపారు కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజం అలీ ఖాన్ కోచులు రామకృష్ణ రియాజ్ క్రీడాకారులు పాల్గొన్నారు.

Tuesday, 12 May 2026

ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

 నసురుల్లాబాద్ ఎస్టీ యువత శిక్షణ కేంద్రంలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు " ఉచిత మగ్గం వర్క్ శిక్షణ" కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు RSETI సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ సోమ వారం రోజున ఒక ప్రకటన లో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 19 నుండి 50 ఏళ్ల లోపు మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. మగ్గం వర్క్ శిక్షణ కోసం శిక్షణా కేంద్రం లోని వసతి గృహంలో ఉండి శిక్షణ పొందాలని ఆయన వివరించారు.

Saturday, 9 May 2026

యుద్ధ కళల్లో ఉచిత శిక్షణ..

 



బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు.మండలంలోని సంగోజీపేట కు చెందిన మాగి నవీన్ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కళల గురుకులం / అకాడమీ ది రైట్ వే కరాటే క్యాంపస్ అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తల్లి దండ్రులు తమ చిన్నారులను బేతాళస్వామి వద్ద ఏర్పాటు చేసిన కరాటే శిక్షణా తరగతులకు పంపిస్తున్నారు. ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుంచి 10 వరకు,సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారులకు కరాటే పై శిక్షణ ఇస్తున్నారు.



మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...