ఎండలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నమో వందే గోమాతరం మరియు వరల్డ్ హిందూ లయన్స్ ఫౌండర్ పెరిక సురేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు వేలాదిమందికి ఉచితంగా చల్లని మజ్జిగ అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
Monday, 18 May 2026
గిరిజన విద్యార్థులకు ఉచిత విద్య
దాతృత్వంతోన ఆదర్శ సమాజ నిర్మాణం .. ఆర్బీ వి ఆర్ ఆర్ ఈ ఎస్ ఎస్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, జె ఎస్ ఎస్ఎన్ రెడ్డి.
అచ్యుత సమంత ప్రారంభించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది పంచుకోవడంలోనే ఆనందం అనే సందేశంతో మే 11 నుండి 17 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ కోఆర్డినేటర్ పి రాజా రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం అబిడ్స్ లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నీని సొసైటీ సెక్రటరీ ప్రొఫెసర్ జి గోపాల్ జాయింట్ సెక్రటరీ ఎస్ఎన్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ వారోత్సవాలలో భాగంగా వాలీబాల్ కిట్ల పంపిణీ రక్తదాన శిబిరాలు పేద విద్యార్థులకు బోధనా సామాగ్రి అందజేత ఆహార పంపిణీ మొక్కలు నాటడం ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టారు యువతలో సేవాభావం నాయకత్వ లక్షణాలు క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం 200 కు పైగా దేశాలకు విస్తరించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమం దాతృత్వాన్ని జీవన విధానంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ సమాజంలో సమానత్వం మానవత్వం పెంపొందించడంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ రెడ్డి జానకి రడ్డి తో పాటు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు
జన్నేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
నవీపేట మండలంలోని చన్నేపల్లిలో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. కోశాలేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురికి దంత పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులు అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ మూడుసు గంగాధర్ ఉపసర్పంచ్ వీరేందర్రావు ఐద్య సిబ్బంది ప్రసూన మనీత్ రావు, అనిల్, అజయ్ కార్తికేయ భరత్ పాల్గొన్నారు.
ఉచితంగా సైనిక్,నవోదయ శిక్షణ
బాన్స్వాడ పట్టణంలోని ద్రోణ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు సుమారు రెండు వందలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ తెలిపారు విద్యార్థులను దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సబ్జెక్టు వారీగా వారి నైపుణ్యాలను గెలికి తీయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి ఉచితంగా సైనిక్ నవోదయ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు 80 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి ఫీజులు 30 శాతం రాయితీ ఉంటుందని ఆయన వివరించారు.
Saturday, 16 May 2026
యూఏఈ లో ఉద్యోగాలకు ఉచిత వీసాలు
అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఏడిఎన్హెచ్ కంపెనీ మన రాష్ట్రంలోని జిటిఎం సంస్థలు సంయుక్తంగా యూఏఈ లో ఆఫీస్ బాయ్ వెయిటర్ డ్రైవర్ పోస్టులకు ఉచితంగా వీసాలు జారీ చేయనున్నాయి ఈనెల 19న జీటీఎం సంస్థ బ్రాంచీలు ఉన్న సికింద్రాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల సిరిసిల్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 23 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉద్యోగాలకు అర్హులని జీత సంస్థ చైర్మన్ సతీష్ రావు ప్రతినిధులు తెలిపారు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగి ఉండడంతో పాటు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలని ఒంటిపై పచ్చబొట్లు టాటూస్ లాంటివి ఉండకూడదని పేర్కొన్నారు ఆఫీస్ బాయ్ లకు నెలకు 26 వేల రూపాయలు వెయిటర్ లకు 30 వేల రూపాయలు హెవీ డ్రైవర్ కు 62000 లైట్ డ్రైవర్లకు 45 వేల వేతనం ఉంటుందని తెలిపారు అయ్యా ఉద్యోగాలకు ఉచిత వసతి భోజన సదుపాయాలు ఉంటాయని వివరించారు ఉచితంగా వీసాలు జారీ చేయడంతో పాటు యూఏఈ కి వెళ్లడానికి విమాన చార్జీలను సైతం కంపెనీ భరించనున్నదని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్ 8332052299 నిజామాబాద్ 86868 60999 ఆర్మూర్ 83320 1399 9, జగిత్యాల 8332042299 సిరిసిల్ల 93916 61522 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Friday, 15 May 2026
ప్రవేశం లభిస్తే ఉచిత కార్పొరేట్ విద్యా
ఆదర్శలో ప్రవేశాలకు 20వ తేదీ వరకు గడువు..
గ్రామీణ ప్రాంతాలలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ స్థాయి విద్యను" ఉచితంగా" అందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో ప్రతిభ కనబరుస్తుండడంతో ఏటా వీటిలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
16 జూనియర్ కళాశాలలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 16 ఆదర్శ పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతున్నాయి. ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ సీఈసీ ఏఈసి గ్రూపులలో ఒక్కో విభాగంలో 40 సీట్లలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు .ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి mec స్థానంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఏఈసి( అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ గ్రూప్) ను ప్రవేశపెట్టారు. ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ,అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆదర్శ జూనియర్ కళాశాలలో అందజేస్తున్న "ఉచిత కార్పొరేట్ స్థాయి విద్య "ను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అనుభవం ఉన్న అధ్యాపకులు బోధించడం వలన ఏటా ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతున్నాయని, బాలికలకు వసతి సౌకర్యం కూడా ఉందని ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తోట గాంధీ తెలిపారు.
Thursday, 14 May 2026
ఉచిత త్రో బాల్ శిక్షణ శిబిరం
ఈషా గ్రామోత్సవం..ఆటలు,వేడుకలు,పురోగతి
14 ఏళ్ళు మరియు ఆ పైబడిన గ్రామీణ మహిళల కోసం ఉచిత త్రోబాల్ శిక్షణ శిబిరం. సులువైన మరియు ఆసక్తికరమైన పద్ధతిలో ఈ ఆటను నేర్చుకోండి. అనుభవజ్ఞులైన కోతుల వద్ద శిక్షణ పొందవచ్చు. అలాగే ఈశా గ్రామోత్సవం కోసం మీ సొంత జట్టును ఏర్పాటు చేసుకోండి. పాల్గొని ఐదు లక్షల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం పొందండి.
కొత్త వాళ్లు కూడా సులభమైన పద్ధతిలో త్రో బాల్ నేర్చుకునే అవకాశం ఇది. సరదా ఆటలు వినోద కార్యక్రమాలలో పాల్గొనండి. నిపుణులైన కోచ్ల నుండి ప్రత్యేక శిక్షణ పొందండి. ప్రతిరోజు అల్పాహారం అందించబడుతుంది. ఈషా గ్రామోత్సవం కోసం మీ సొంత జట్టును ఏర్పాటు చేసుకొని పాల్గొని ఐదు లక్షల రూపాయలు బహుమతి పొందే అవకాశం పొందండి.
పరిమిత సీట్లు ..ఇప్పుడే చేరండి..
వేదిక ..సిరిసిల్ల ..రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
తేదీ ..మే 13 నుండి 17 వరకు
ఈరోజే రిజిస్టర్ చేసుకోండి..
Isha.co/grm-camp
మరిన్ని వివరాలకు..8300030999
తేదీ ..మే 20 నుండి 24 వరకు
వేదిక.. కరీం నగర్, తెలంగాణ.
తేదీ ..మే 27 నుండి 31 వరకు
వేదిక.. వరంగల్, తెలంగాణ
తేదీ.. మే 27 నుంచి 31 వరకు
వేదిక..చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
తేదీ ..మే 27 నుంచి 31 వరకు
వేదిక.. విశాఖ పట్నం , ఆంధ్రప్రదేశ్
తేదీ ..మే 18 నుంచి 22 వరకు
వేదిక .. పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్
తేదీ మే 20 నుంచి 24 వరకు
వేదిక.. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్..
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...



