Sunday, 31 May 2026

హైదరాబాద్ లో ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 


చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల  నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వాత కదల్లేని వారికి సంజీవనిలాంటిది ఫిజియోథెరపీ చికిత్స. చాలా వ్యాధులలో అవసరమయ్యే ఫిజియోథెరపీ ని క్రమం తప్పకుండా రోగులకు అందజేస్తే రోగాలు పెరగకుండా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.ఐతే చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల,చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల,ఖర్చు ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో ఫిజియోథెరపీ కి దూరంగా ఉంటుంటారు.అలా రోగాలు తగ్గకపోవడం ,సమస్యలు పెరగడం జరుగుతుంటాయి.

అందుబాటులో ఆధునిక మందులు ఎన్ని ఉన్నా,కొన్నింటికి ఫిజియోథెరపీ చికిత్స తప్పనిసరి.కానీ ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని.ఐతే పేదలకు ఉపయోగపడే ఉద్దేశం తో ఈ ఖరీదైన సేవలను ఉచితంగా అందిస్తోంది ఒక స్వచ్ఛంద సంస్థ.

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ కు చెందిన కొలసాని హరీష్ అనే వ్యక్తి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిర పడ్డారు. మంచి జీతంతో జీవితం విలాస వంతంగా గడుస్తున్నప్పటికీ సంతృప్తి చెందలేదు. తను పుట్టిన మాతృ భూమికి ఏదైనా చేయాలని తపించాడు. ఆ తపన లో నుండి పుట్టినదే ఈ ఉచిత ఫిజియోథెరపీ అందించాలనే ఆలోచన.అలా 2012 లో " ఎన్ ఆర్ ఐ సేవా ఫౌండేషన్ "అనే ఎన్జీవో ను స్థాపించారు ఆయన.

మొదట మురికి వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహించాడు.మంచానికి పరిమితమైన వారికి" మొబైల్ అంబులెన్స్ " ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో పేదల దీన స్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించాడు.వారికి ఫిజియోథెరపీ చికిత్స ను పెద్ద ఎత్తున అందించాలని సంకల్పించాడు. ఈ విషయంలో తన సన్నిహితులతో సంప్రదిస్తే ..ఇప్పటికే చాలా చేస్తున్నావు, ఇది అవసరమా అని నిరాశకు గురి చేశారు వారు.

కానీ ప్రసాద్ గారు వెనుకడుగు వేయకుండా 2013లో వివేకానంద నగర్ లో ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైనీ డీలింగ్, అల్ట్రా సౌండ్,టెన్స్, ఇంటరా వెర్షన్ ఫెరెన్షియల్ థెరపీ, మజిల్ స్టిమ్యులేటర్,ట్రాక్షన్ పారాఫిన్ వ్యాక్స్, ఐ ఆర్ ఆర్ ల్యాంప్, ఫిజియో బాల్, ల్యాడర్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచాడు. కార్పొరేట్ కు ధీటుగా సేవలు అందిస్తుండడంతో సమాజం నుంచి మంచి స్పందన లభించింది.2017 లో మోతీ నగర్ లో మరో కేంద్రాన్ని స్థాపించాడు. కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు అంటూ వచ్చిన వారిని ఎవరినీ ఊరికే వెనక్కి పంపించరు.రోగులు ఎక్కడి వారైనా, ప్రిస్క్రిషన్ రాసింది ప్రభుత్వ వైద్యుడా, ప్రైవేట్ వైద్యుడా అని చూడకుండా.. ప్రిస్క్రిప్షన్ ఉంటే చాలు , కేంద్రంలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.సమస్యను బట్టి ఎన్ని రోజులైన ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ రెండు కేంద్రాలకు కలిపి ప్రతి రోజూ దాదాపు 250 నుండి 300 వరకు రోగులు వస్తుంటారు. హైద్రాబాద్ నుండే కాకుండా , రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి రోగులు వరుస కడుతున్నారు.

తన తల్లికి అనారోగ్యంతో ఫిజియోథెరపీ చికిత్స అందించడంలో ఎదురైన ఇబ్బందులను గమనించి, ఫిజియోథెరపీ చికిత్స ప్రాధాన్యత గుర్తించి ఈ ఎన్జీవో స్థాపించినట్లు హరీష్ తెలిపారు.ఇప్పటివరకు 14 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం నెలకు దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉచిత కుట్టు మిషన్లు పంపిణి

 


నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్  ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటీరియల్ రంజిత్ సింగ్ ఠాకూర్  పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బీబీపేటలో ఉచిత వైద్య శిబిరం



 కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్ వారి సౌజన్యంతో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం అయ్యిందని సర్పంచ్ సాధ్విక, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ ,పాలకవర్గ సభ్యులు తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా మెడిసిటీ హాస్పిటల్ ఘనపూర్ మరియు మేడ్చల్  వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఉచిత మెగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతోపాటు కంటి పరీక్షలు , చెవి ముక్కు గొంతు, వరిబీజం ,బీజ కుట్టు, గడ్డలు , కంతులు థైరాయిడ్ గడ్డలు,  గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబాన్నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళనొప్పులు, నడుము నొప్పులు, నరాల సమస్యలు,  కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు ప్రమాదంలో వేసిన రాడ్స్ తీయడంతో పాటు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచితంగా వైద్యం అందిస్తాం అని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 104 మంది రోగులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారని 60 మందికి వివిధ రకాల శాస్త్ర చికిత్సల అవసరమని గుర్తించామని తెలిపారు .ఆదివారం బీబీపేట పంచాయతీ ఆవరణలో మెడిసిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న రోగులు ఉదయం 8 గంటలకు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని ఉచిత బస్సులో మెడిసిటి హాస్పిటల్ కు తీసుకు వెళ్లి శస్త్ర చికిత్సలతో పాటు " మందులను సైతం ఉచితంగా" అందజేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాధ్విక,  ఉప సర్పంచ్ ప్రశాంత్ తో పాటు పాలకవర్గ సభ్యులు ,పంచాయతీ కార్యదర్శి రమేష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మెడిసిటి హాస్పిటల్ వైద్యులు వెంకటాద్రి ,రాకేష్ ,రాఘవేంద్ర తో పాటు సిబ్బంది, రోగులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ముత్తూట్ ఫైనాన్స్ ఉచిత వైద్య శిబిరం

 


ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముగల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి అన్నారు. శనివారం భీంగల్ కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించారు. శిబిరం రీజినల్ నిజామాబాద్ జిల్లా మేనేజర్ బొమ్మ మహేష్ బాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం ప్రజలకు ఉచిత సేవ చేయడం మంచి కార్యక్రమం అన్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరంతో పాటు 150 మందికి ఏడాదికి సరిపడా మందులను ఉచితంగా పంపిణీ చేశారు దళిత శిబిరం ఏర్పాటు చేసిన ఫైనాన్సువారికి పట్టణ ప్రజల తరఫున చైర్మన్ మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతోటి ఫైనాన్స్ వారు ఆధ్వర్యంలో చైర్మన్ దంపతులకు శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్, హరి నారాయణ, ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ క్లస్టర్ మేనేజర్ శ్రీకాంత్, మార్కెటింగ్ మేనేజర్ రఘు, బ్రాంచ్ మేనేజర్ బండి మహేష్ సిబ్బంది వినయ్ ,విగ్నేష్ , వర్ష తదితరులు పాల్గొన్నారు.



సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థులకు ఉచిత ఓరియంటేషన్

 డాక్టర్ మర్రి మానవ వనరుల అభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా సుపరిపాలన ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం వారం రోజుల ఉచిత ఓరియంటషన్ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహిస్తుంది .జూన్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం సివిల్ సర్వీసెస్ మరియు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు .ప్రతిరోజు మూడు గంటల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులు, సీనియర్ అధికారులు పాల్గొని అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందిస్తారు. పరీక్షా వ్యూహాలు, ప్రణాళిక ,వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు,కెరీర్ మార్గదర్శకత్వం పై ప్రధానంగా శిక్షణ అందిస్తారు. "శిక్షణ మాత్రమే ఉచితంగా "ఉంటుంది. బస ,భోజన సదుపాయాలు అభ్యర్థులే  ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది .ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ctsmcrhrdit24@gmail.com కు మెయిల్ చేయాలి.

Saturday, 30 May 2026

ఫ్రీ ఏ ఐ మాస్టర్ క్లాస్

 


ఫ్రీ ఏ ఐ మాస్టర్ క్లాస్,31-5-2026



https://avinashmada.com/master-ai-future-proof-your-career?gc_id=23099904886&h_ga_id=187190195992&h_ad_id=777968169499&h_keyword_id=&h_keyword=&h_placement=&utm_source=Google&utm_medium=Free+|+Image+|+Telangana+|+BT+|+Group3+|+25to40&utm_campaign=TF+|+AM+|+Free+|+Image+|+Telangana+|+camp3+|+8Oct25&utm_content=Img8+Still+don%E2%80%99t+know&gad_source=2&gad_campaignid=23099904886&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-UC9xKyeOYo-o9C2u720ghmpcvK-qLO-gauLrYqGuL58F6aYkKdbt4aAnDOEALw_wcB



14 రోజులు ఫ్రీ యోగా క్లాసులు

 



వచ్చే సోమవారం నుండి అంటే జూన్ 1వ తారీకు నుండి ఆన్లైన్లో ఉచితంగా యోగ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కలిగిన వారు ఈ యోగ క్లాసులో ఉచితంగా జాయిన్ అయి యోగ సాధన చేయవచ్చు. ఇప్పటికే ఎంతోమంది ఈ ఉచిత యోగా క్లాసులను వినియోగించుకుంటున్నారు ఈ యోగా క్లాసులో జాయిన్ కావాలంటే ఈ కింది లింక్ లో మీ వివరాలు నమోదు చేసుకుంటే వాట్సప్ కు ప్రతిరోజు యోగా షెడ్యూల్ వస్తుంది.


https://yoga.healthyday.co.in/telugu/?ref=GAds_SC1_LA1LA2_RmVlgReBa_ResrDSE7D_MntrHK2telTrmdV3_SplitViewtelV2_ResrTerPl_13APR26&gad_source=2&gad_campaignid=23282412477&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-W9s4ridJ_hHqntsoKy4WMpAD09h69hK5WApZW55gzSKauEI_DJPHwaAgb6EALw_wcB




https://yoga.healthyday.co.in/telugu/?ref=GAds_SC1_LA1LA2_RmVlgReBa_ResrDSE7D_MntrHK2telTrmdV3_SplitViewtelV2_ResrTerPl_13APR26&gad_source=2&gad_campaignid=23282412477&gclid=Cj0KCQjwlerQBhDMARIsAB16H-W9s4ridJ_hHqntsoKy4WMpAD09h69hK5WApZW55gzSKauEI_DJPHwaAgb6EALw_wcB





మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...