Sunday, 15 March 2026

ఉచిత శిక్షణ @ భూదాన్ పోచంపల్లి

 యాదాద్రి భువన గిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పురంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ సమ్మర్ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్. కిషోర్ రెడ్డి శని వారం ఒక ప్రకటనలో తెలిపారు.

45 రోజుల వ్యవధి కలిగిన బేసిక్ కంప్యూటర్ కోర్సుకు ఇంటర్ పాస్ లేదా ఇటీవల ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఎలక్ట్రీషియన్, సీసీటీవీ అండ్ సెల్ ఫోన్ రిపేరింగ్, ఆటో మొబైల్ కోర్సులకు మాత్రం 10 వ తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఫోటో లతో ఈ నెల 23 తేదీ లోపు సంస్థ లో నేరుగా అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.

కోర్సు ఫీజు 1000 రూపాయలు,హాస్టల్ లో ఉండే వారు నెలకు 4,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

పూర్తి వివరాలకు 9133908000,9133908111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


No comments:

Post a Comment

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...