Wednesday, 25 March 2026

ఉచిత యోగా శిక్షణ @కామారెడ్డి

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో గల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ప్రతిరోజు ఉదయం పూట యోగా శిక్షణ ఇస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో వచ్చే వారు  ప్రస్తుతం 50 కి పైగా వచ్చి యోగ నేర్చుకుంటున్నారు. వారి వారి వ్యక్తిగత అనారోగ్యాలకు అనుగుణంగా యోగాసనాలు శిక్షకుడు లింగం నేర్పిస్తున్నారు.

ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులలో అనేకమంది ప్రజలు చర్మవ్యాధులు ,వెన్ను నొప్పి సంబంధిత వ్యాధులు స, డిస్క్ లోపాలు తదితర సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతూ ప్రైవేటులో లక్షల రూపాయలు  ఖర్చుపెట్టినా తగిన ఫలితం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో , సంప్రదాయ వైద్యానికి పెద్ద పీట వేస్తూ కేంద్రం నేషనల్ ఆయుష్ మిషన్ పేరుతో వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఇద్దరు యోగ శిక్షకులు ఒక వైద్యుడు ఒక అటెండర్ ను నియమించారు. ఎంతోమంది ప్రజలు వీటిని వినియోగించుకుంటూ సత్ఫలితాలను పొందుతున్నారు. ఉచితంగా సేవలు అందడంతో ప్రజలు ఆర్థిక భారం తగ్గించుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

No comments:

Post a Comment

నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...