ఏప్రిల్ 15 తేదీన ఉచిత మెగా జాబ్ మేళా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్, హోటల్ మేనేజ్ మెంట్ చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
18 నుండి 30 ఏళ్ల లోపు వయసు గల వారు అర్హులనీ ,బ్యాంకింగ్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటిఐ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా తదితర రంగాలలో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు.
ఇతర వివరాలకు 94933 10781,98484 30111 ఫోన్ నంబర్ లలో సంప్రదించాలని సూచించారు.
No comments:
Post a Comment