3, ఏప్రిల్ 2026, శుక్రవారం

స్వామి రామానంద తీర్థ సంస్థలో ఉచిత శిక్షణ


భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .

ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..

 కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .

అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.

 పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...