జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిరుపేద ,మధ్యతరగతి విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది.
2027 లో యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్ టీ , మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉచిత శిక్షణ పొందేందుకు విశ్వవిద్యాలయం జూన్ 6న హైదరాబాద్లో అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, దీంట్లో మెరిట్ సాధించిన వారికి ఒక ఏడాది పాటు ఉచిత శిక్షణ, భోజన వసతితో పాటు పూర్తిస్థాయిలో లైబ్రరీ సౌకర్యం కూడా కల్పిస్తారని వెల్లడించారు .
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను https ://admission.jmi.ac.in వెబ్సైట్లో మే 26 లోపు ఒక వెయ్యి 325 రూపాయల ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment