ఫ్రీ పోలీస్ కోచింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ పోలీస్ కోచింగ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2026, శుక్రవారం

పోలీస్ అభ్యర్థినులకు .. ఉచిత శిక్షణ

 రెండు దశాబ్దాలుగా ఉచిత సేవలు..అభయ ఫౌండేషన్

పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న నిరుపేద మహిళా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అభయ ఫౌండేషన్ గురువారం నాడు ప్రకటించింది. 100 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు "ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కూడా" కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఇబ్రహీం పట్నం లోని అభయ ఆనంద నిలయంలో జరిగే ఈ ఉచిత శిక్షణ కార్య క్రమానికి "రీగల్ రెక్స్ నార్డ్, వీ ఎం ఆర్ లాజిస్టిక్స్ సంస్థలు సహకరిస్తున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది. 

సీనియర్ ఇన్స్పెక్టర్ పీ. జగదీశ్వర్ పర్యవేక్షణలో ఇది జరగనుంది. అభ్యర్థినులను ఎంపిక చేయడానికి ఆదివారం రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్ లతో పాటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూర్, ఖమ్మం, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్, సిద్ధి పేట, సంగారెడ్డి లలో అర్హతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 

మరిన్ని సమగ్ర వివరాలకు 9963002727,9959220450,7032813578 నంబర్ లలో సంప్రదించాలని అభయ ఫౌండేషన్ కోరింది. గత రెండు దశాబ్దాలుగా ఈ తరహా సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు వివరించారు.

6, ఆగస్టు 2026, గురువారం

మైనారిటీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ లు

 తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన మైనారిటీ లకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం పోలీస్ శాఖ లోని వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD యాకూబ్ పాషా తెలిపారు. 

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల  చేశారు.SI పోస్టులకు 50 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. 

పూర్తి సమగ్ర వివరాలకు..

85208 60785, 040-23236112, 90590 50062 నంబర్ లలో సంప్రదించాలని ఆయన సూచించారు. 

పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ .. ఉచిత శిక్షణలు

 తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ తెలిపింది.

ప్రస్తుతం  ఎస్ ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు " ఉచిత శిక్షణ తో పాటు వసతి సౌకర్యం" కల్పించాలని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్ణయించింది. 300 మంది అభ్యర్థులకు ప్రత్యక్షంగా .. మరో 300 మందికి ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. లయన్స్ క్లబ్ మరియు రాంకీ గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ ప్రొ. లక్ష్మీ కుమారి తెలిపారు. 

 సెప్టెంబర్ 15 నుంచి మొదలయ్యే శిక్షణ ఎస్ ఐ మెయిన్స్ పరీక్షలు ముగిసే వరకు కొనసాగుతుంది.

ఆసక్తి గల అభ్యర్థులు 95424 33427 ఫోన్ నెంబర్ లేదా https://paravasthucreativefoundation.net వెబ్ సైట్ ను సందర్శించాల్సిందిగా కోరారు. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...