భారత దేశం లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన పథకం" ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన PM JAY. ఈ పథకం ద్వారా అర్హులైన పేద మధ్య తరగతి కుటుంబాలకు సంవత్సరానికి రూ 5 లక్షల వరకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది.
ఫ్రీ గా ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స పొందేందుకు ఈ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అత్యంత కీలకం. ఈ హెల్త్ కార్డ్ పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లో నుండే మీ మొబైల్ ఫోన్ లోని అధికారిక వాట్సప్ చాట్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ అధికారిక ఆయుష్మాన్ సారధి వాట్సాప్ నంబర్ +91 72908 23838 కు " hi" లేదా" hello" అని మెసేజ్ పంపి ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చు. చాట్ బాట్ సూచనల ప్రకారం మై ఆయుష్మాన్ కార్డ్ ఆప్షన్ ను ఎంచుకుని , ఈ- కే వై సి పూర్తి చేసి నేరుగా కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ తో పాటు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అధికారిక వెబ్ సైట్ అయిన beneficiary.nha.gov.in ను సందర్శించి మొబైల్ నెంబర్, OTP ద్వారా లాగ్ ఇన్ కావాలి. అడిగిన వివరాలు ఎంటర్ చేసి మీ పేరు, గుర్తింపు నంబర్ ఆధారంగా వివరాలు సెర్చ్ చేసి , ఫోటో అప్ లోడ్ చేసి అవసరమైన వివరాలు సబ్మిట్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ పథకం కింద ఎలాంటి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ పొందేందుకు అర్హులే. వీరితో పాటు 2011 సామాజిక ఆర్థిక కుల గణన SECC డేటా ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల లోని ఆర్థికంగా వెనుకబడిన అనేక కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సులభ విధానాన్ని అనుసరించి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందవచ్చు.