డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం .. 08461-295428
ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి స్వయం ఉపాధి కోర్సుల ఉచిత శిక్షణ ప్రారంభం..
డిచ్ పల్లి లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 2026-27 ఆర్థిక సంవత్సరం లో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల ఉచిత స్వయం ఉపాధి శిక్షణ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది..
ఏక కాలంలో 10 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.. శిక్షణా సమయంలో హాస్టల్ వసతి కల్పిస్తారు.. కోర్సు పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం,టూల్ కిట్స్ అందిస్తారు..
అభ్యర్థులు సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలకు సిఫార్సు చేస్తారు.
మార్చి నెల 31 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు చెందిన 19 నుండి 45 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవికుమార్ కోరారు..
ఈ కింది 10 అంశాల్లో శిక్షణ ఇస్తారు..
టైలరింగ్, మగ్గం వర్క్,బ్యూటీషియన్, CC కెమెరా ఇన్స్టలేషన్ మరియు రిపేరింగ్, ఏసీ ఇన్స్టలేషన్ అండ్ రిపేరింగ్, ఫోటోగ్రఫీ, తేనెటీగల పెంపకం, కూరగాయల నర్సరీ, పచ్చళ్ళ తయారీ, పుట్ట గొడుగుల పెంపకం
కావలసిన జిరాక్స్ పత్రాలు..
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా ( పాస్ /ఫెయిల్ ),5 ఫొటోలు, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు
సందేహాల నివృత్తికి..
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ల్లోని ఆసక్తి కల యువతీ యువకులు తమ సందేహాల నివృత్తికి ఆఫీసు వేళల్లో 08461-295428 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని సూచించారు.పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు డైరెక్టర్ రవికుమార్..
No comments:
Post a Comment