Wednesday, 6 May 2026

వేసవిలో క్రీడా శిబిరాలు

 వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం ఆయా మండలాలలో క్రీడలలో నైపుణ్యం కలిగిన వారిని శిక్షకులుగా నియమించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 క్యాంపులు రూరల్ ప్రాంతాలలో, 10 క్యాంపులు అర్బన్ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమా రు 20 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూరల్ ప్రాంతాలలో 5000 అర్బన్ ప్రాంతాలలో 7500 చొప్పున శిక్షకులకు ఇవ్వనున్నది. మే ఒకటి నుంచి జూన్ 7 వరకు ఈ శిబిరాలను వహించండి నిర్వహించనున్నారు. 

అర్బన్ లో నిర్వహించే క్రీడలకు మాత్రమే ఫీజు.. రూరల్ ప్రాంతంలో ఉచితం..

 అర్బన్ ప్రాంతాలలో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు  చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ప్రాంతంలో క్రీడలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పని క్రీడలలో అతనిటిక్స్ క్రీడాకారుడు 400 రూపాయలు చొప్పున బాస్కెట్బాల్కు 400 రూపాయలు బ్యాడ్మింటన్ కు వెయ్యి రూపాయలు క్రికెట్ 700 టేబుల్ టెన్నిస్ 700, స్కేటింగ్ స్విమ్మింగ్ టెన్నిస్ కు ఎనిమిది వందల రూపాయల చొప్పున ఫీజు నిర్ణయించారు..

రూరల్ ప్రాంతాలలోని శిబిరాలకు వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు.

Monday, 4 May 2026

ఉచిత డిజిటల్ సహకార కోర్సులు

 తెలుగు తో సహా 8 భాషలలో సహకార డిజిటల్ వీడియో కోర్సులు.160 కి పైగా కోర్సులను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర సహకార శాఖ..

సహకార రంగానికి సంబంధించి 160 కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8భాషలలో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతి దారులు,విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ ఐ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు.ఇందుకోసం ప్రత్యేకంగా  savidya.coop పేరిట ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది.

సవిద్య అంటే సహకార విద్యాలయం .ఇది దేశంలోనే మొట్ట మొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు,విద్యార్థులు, ఎగుమతి దారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ  ' సహకార్ సే సమృద్ధి ' చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణ ను అందిస్తుంది.

వ్యవసాయ పద్ధతులు ,ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160 కి పైగా  ఉచిత వీడియో కోర్సులు . తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషలలో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత  ఫీచర్లను  ఉపయోగించి కంటెంట్ ను వ్యక్తిగతికరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా ఙ్ఞానాన్ని అందించేందుకు ఏ ఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది. వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ,పంట దిగుబడిని మెరుగుపరచు కోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి.  విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధనా అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు ఎగుమతి దారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు , అంతర్జాతీయ వాణిజంపై అవగాహన పొందడానికి అవసరమైన  కోర్సులను సైతం ఇందులో పొందుపరచడం విశేషం.

నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ , క్రిబ్కో వంటి సహకార సంస్థలు సహకార విద్య ప్లాట్ ఫామ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17 వేల సహకార సంఘాలను రెండు కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయడమే దీని లక్ష్యం.

మీరు savidya.coop లో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకుని , సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు.

ఉచిత అంబలి పంపిణీ @కోనాపూర్, బాన్సువాడ

 బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని గ్రామస్తులు,బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేశ్వర్ గౌడ్ తెలిపారు.సోమవారం ఆయన గ్రామంలో ఉప సర్పంచ్ బంజ భూషణం, పంచాయతీ కార్యదర్శి భరత్ లతో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మండ్లు , గ్రామ యువకులు పాల్గొన్నారు..

ఉచిత న్యాయము.. భారత దేశంలో ఇలా

 భారతదేశంలో ఉచిత న్యాయ సహాయము ఇలా పొందవచ్చు..

ఉచిత న్యాయము.. ఉచిత న్యాయం అనేది ప్రజల హక్కు. దీనికొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు వినియోగించుకోవాలి .బాధితులు న్యాయస్థానాలను ఇప్పుడు ఆశ్రయించడం చాలా సులభతరం .న్యాయ సహాయమే కాదు ,పరిహారం పంపిణీ సేవలు కూడా పొందవచ్చు. లోక్ అదాలతల నిర్వహణలో నంబర్ వన్ గా టి ఎస్ ఎల్ ఎస్ ఏ. బంధాలు తెగిపోకుండా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారము. 

ఉచితంగా న్యాయ సహాయం పొందడం అనేది ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇదే చెబుతోంది .కోర్టు పేరు చెబితే చదువుకున్న వారు, ఆర్థికంగా కొద్దో గొప్ప ఉన్నవారు కూడా హడలిపోతారు. కోర్టుల పోరాటం అంటే ఖరీదైన వ్యవహారమే. మరి నిరుపేదలు నిస్సహాయులు అభాగ్యులు అనాధలు ఏం చేయాలి? ఎలా న్యాయం పొందాలి దీనికోసం ఉద్భవించినవి లీగల్ సర్వీసెస్ అథారిటీలు వివక్ష లేకుండా న్యాయం అందరికీ సమానంగా అందాలనేది దీని మూల సూత్రము న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి అథారిటీ సహాయం అందిస్తుంది. పేదలకు ఉచిత న్యాయ సలహానే కాదు న్యాయవాదిని అందిస్తుంది అంతేకాదు పలు పథకాలు అందజేస్తుంది నవంబర్ 9వ తేదీన లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గా జరుపుకుంటారు 

నేషనల్ అథారిటీ.. 

చట్టాల పైన అవగాహన లేమి తో అనగారిన, బలహీన వర్గాలకు సరైన న్యాయం అందడం లేదని సుప్రీంకోర్టు భావించింది. ఉచిత న్యాయ సేవలను అందించడానికి, వివాదాల సామరస్య పూర్వక పరిష్కారానికి లోక్ అదాలత్ ల నిర్వహణ కోసం 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ /నల్సా ఏర్పాటు చేసింది నల్సా పాట్రన్ ఇన్ చీఫ్ గా భారత ప్రధాన న్యాయమూర్తి, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు.

రాష్ట్ర అథారిటీ ..

ప్రతి రాష్ట్రంలో నల్సా విధానాలు, ఆదేశాలను అమలు చేయడానికి, ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి ,లోక్ అదాలతులను నిర్వహించడానికి రాష్ట్ర న్యాయ సేవల అథారిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి పాట్రన్ ఇన్ చీఫ్ గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, హైకోర్టులో రెండో సీనియర్ న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జిల్లా న్యాయ సేవల అథారిటీకి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

ఉచిత సేవలు ఎవరికి అంటే..

ఎస్సీ, ఎస్టీలు, మానవ అక్రమ రవాణా బాధితులు, మహిళా లేదా చిన్నారులు, మానసిక రోగులు ,దివ్యాంగులు ,ప్రకృతి విపత్తులు, జాతి హింస, కుల హింస, వరదలు, కరువు ,భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు లాంటి వాటిలో అనుకోని పరిస్థితుల్లో బాధితులు, పరిశ్రమలలో కార్మికులు, బాల నేరస్తులు ,మానవ అక్రమ రవాణా బాధితులుగా పోలీసు కస్టడీలో ఉన్నవారు.. వీరందరూ ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు.

అథారిటీ ఏం చేస్తుంది అంటే..

ఉచిత న్యాయ సహాయం ,లోక్ అదాలత్ నిర్వహణ, నల్సా పథకాల అమలు, బాధితులకు పరిహారం అందజేత, మీడియేషన్, ఉచితంగా న్యాయవాది ఏర్పాటు .


నల్సా కార్యాలయ అడ్రస్..


నల్సా ,భారత సుప్రీంకోర్టు, తిలక్ మార్క్,

 న్యూఢిల్లీ 1100 01 ,

హెల్ప్ లైన్ నెంబర్ 15100.


సిటిజన్ల కోసం..  

నల్సా కేంద్రం.. జై సల్మేర్ హౌస్, 26 మాన్సింగ్  రోడ్, న్యూఢిల్లీ 1100 11.

రాష్ట్ర అథారిటీ పరిధిలోని మొత్తం ప్యానెల్ లాయర్లు.. 252 ,

వీరిలో పురుషులు ..157 ,మహిళలు.. 75

 వీరి కాల పరిమితి మూడేళ్లు.

ప్రజాసేవకే అథారిటీ.. కక్షిదారులకు ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలతో పాటు మధ్యవర్తిత్వం ద్వారా అథారిటీ పరిష్కారం చూపిస్తుంది. నల్సా ద్వారా టీజీఎల్ఎస్ ఏ  అందించే ఈ సేవలు, పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల చెంతకే పలు పథకాలు చేరేలా వలంటీర్లు మీ వద్దకే వస్తున్నారు. మధ్యవర్తిత్వంతో న్యాయం సత్వరం దక్కుతుంది. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ సేవలను తెలుసుకొని సహాయం పొందవచ్చు .మీకోసమే అథారిటీ అన్నది గుర్తుంచుకోండి.

మరిన్ని వివరాలకు tslsa.telangana.gov.in  వెబ్ సైట్  సందర్శించవచ్చు.

Sunday, 3 May 2026

ఉచితంగా తిరుపతి లడ్డూలు @ హైద్రాబాద్ లో

 


హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉచితంగా తిరుపతి లడ్డూల పంపిణీ..


హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో గల టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 6 వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.



 ఈ సందర్భంగా భక్తులకు ప్రతి ఒక్కరికి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచితంగా 2 తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు.


ఉచిత కంప్యూటర్ శిక్షణ @బోర్లం

 కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ తరగతులను శని వారం బాన్సువాడ సీఐ శ్రీధర్ ప్రారంభించారు.40 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. 

గ్రామంలోని గ్రంథాలయంలో సుమారు 80 నుండి 100 మంది వరకు ఉచితంగా కంప్యూటర్ ట్రైనింగ్ మన్నె అనిల్ ఆధ్వర్యంలో పొందుతున్నారు. ఉదయం సాయంత్రం బ్యాచుల వారీగా ఉచిత శిక్షణ పొందుతున్నారు. పట్టణాలలో వేలాది రూపాయలు వెచ్చించి పొందే శిక్షణను ఇచ్చట పేదలకు ,వేసవి సెలవుల నేపథ్యంలో ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో మన్నే అనిల్ ట్రైనర్ గా కంప్యూటర్ బేసిక్స్ ఎమ్మెస్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఫోటోషాప్ టైపు రైటింగ్ తదితర కంప్యూటర్ స్కిల్స్ 

 ట్రైనింగ్ ఇస్తున్నారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె రమేశ్,నాయకులు శ్రీనివాస్ రెడ్డి,నర్సింలు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 May 2026

వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 గాంధారి మండలంలోని పెట్ సంఘం ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి వాలీబాల్ క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభించినట్లు వాలీబాల్ కోచ్, వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారిణ, ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ వాలీబాల్ కోచ్ సోనియా సమక్షంలో శిబిరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు, ఆసక్తి గలవారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అంతర్జాలంలో 100 రూపాయలతో దరఖాస్తు చేసుకొని శిక్షణ పొందవచ్చని ఆమె తెలిపారు .శిబిరానికి బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున నెదర్లాండ్ కు చెందిన" లెట్స్ కీప్ ది బాల్ ప్లేయింగ్ ఫౌండేషన్ "వారు చేయూతనిస్తున్నారని పేర్కొన్నారు.



మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...