కెనరా బ్యాంక్ వారి సహకారంతో నసురుల్లాబాద్, కామారెడ్డి జిల్లా లో ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ప్రారంభం అయింది.కేంద్రాన్ని ప్రారంభించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కు చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల యువతీ యువకులు ఉచిత శిక్షణ పొందడానికి అర్హులని అన్నారు.
తగిన ధృవ పత్రాలతో కార్యాలయంలో సంప్రదించి శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందాలని సూచించారు..
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ లోని కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఏప్రిల్ ఒకటి నుంచి 2026 27 ఆర్థిక సంవత్సరానికి గాని పలు కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తారు .
ఏకకాలంలో నిరుద్యోగ యువతకు ,మహిళలకు తొమ్మిది రకాల కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు .హాస్టల్ వసతి కల్పిస్తారు .కోర్సు పూర్తయిన తర్వాత ధ్రువపత్రము, మరియు టూల్ కిట్స్ అందిస్తారు. అభ్యర్థులు సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాల మంజూరుకు సిఫారసు చేస్తారు . ఏప్రిల్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇవ్వనున్నారు .ఈ అవకాశాన్ని 19 నుంచి 50 ఏళ్లలోపు వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. దరఖాస్తుల సమర్పణ పూర్తయిన వారం రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తారు .
పురుషులకు ..
ద్విచక్ర వాహన, సెల్ ఫోన్ ,సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్, సర్వీసింగ్, మరమ్మత్తులు, ఫోటోగ్రఫీ ,ఎలక్ట్రికల్ హోమ్ వైరింగ్ , ప్లంబింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు.
స్త్రీలకు ..
టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, వస్త్ర బ్యాగుల తయారీ ,కొవ్వొత్తుల తయారీ ,పుట్టగొడుగుల పెంపకం తదితర అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు.
సమర్పించాల్సిన జిరాక్స్ పత్రాలు..
అభ్యర్థులు కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా( పాసర్ /ఫెయిల్), అయిదు ఫోటోలు, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి. ఇతర వివరాలకు కార్యాలయ సమయాలలో నేరుగా సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment