10-3-2026 నుండి 9-4-2026 వరకు
పశువులలో సంభవించే గాలికుంటు వ్యాధిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.
గాలికుంటు వ్యాధి ద్వారా పశువులు అనారోగ్యానికి గురై పాలు సరిగా ఇవ్వకపోవడం ,ఇంకా పలు రకాల సమస్యలు వస్తాయి.నోట్లో పుండ్లు పడతాయి. తీవ్ర జ్వరం వస్తుంది.
వీటిని నివారించి ఆవులు, గేదెల ఆరోగ్యాన్ని కాపాడడానికి
ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు..
ప్రభుత్వ వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ వారు గ్రామానికి వచ్చినప్పుడు ఆవులు, గేదెల కు టీకాలు వేయించి ఈ " జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం" ను విజయ వంతం చేయాలని కోరుతున్నారు...


No comments:
Post a Comment