నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే వారికి దాతలు ఉచితంగా పులిహోర తాగునీరు అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అధికారులకు సమస్యలను చెప్పుకోవాలని వచ్చే వారికి సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు గత పది సంవత్సరాలుగా పులిహోర అందిస్తూ ఆకలి తీర్చుతు న్నారు .తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు 15 ఏళ్లుగా చల్లని నీరు అంబలి పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించి స్వయంగా ఉచిత పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణికి వచ్చేవారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని ఫోరం ప్రతినిధులు తెలిపారు.
ఇక రాజస్థానీ వాకర్స్ గ్రూప్ సౌజన్యంతో చల్లటి తాగునీటిని కూడా అందజేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫోరం ప్రతినిధులు మరియు వాకర్స్ గ్రూపు సభ్యులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ రెడ్డి ఏవో ప్రశాంత్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వాకర్స్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment