భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మై ఆధార్ పోర్టల్ లో ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్ డేట్ గడువు ను పొడిగించింది. ఆధార్ కార్డు దారులు ఇప్పుడు తమ గుర్తింపు,చిరునామా ఆధార పత్రాలను ఎలాంటి ఫీజు లేకుండా 2027 జూన్ 14 వరకు అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటున్న ఆధార్ కార్డు దరుల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకొని ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
ఆధార్ కార్డుదారులు కొత్త ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ కొత్త యాప్ లో సురక్షితమైన ఆధార్ క్యూఆర్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఆధార్ సేవలకు సులభమైన యాక్సెస్ వంటి ఫీచర్లు ఉన్నాయని UIDAI వివరించింది.
No comments:
Post a Comment