కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ వద్ద గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య నిరుపేద భక్తుల కోసం ఏర్పాటుచేసిన" అయోధ్య మరియు కాశి ఉచిత యాత్ర " కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గంప శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర మూడవ సంవత్సరానికి చేరుకోవడాన్ని అభినందించారు. వైశ్య నిరుపేద భక్తుల కోసం గంప శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ఈ యాత్రను ఏర్పాటు చేయడం, సుమారు 8 రోజుల పాటు సాగే యాత్ర కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేసి దాదాపు 45 కుటుంబాల సభ్యులను "అయోధ్య, కాశీ క్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లడం" చాలా గొప్ప విషయం అన్నారు. యాత్రకు బయలుదేరిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని అన్నారు. అయోధ్య రాముడు మరియు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖంగా సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బిజెపి నాయకులు మరియు యాత్రకు బయలుదేరిన భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఫ్రీ టూర్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫ్రీ టూర్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
26, అక్టోబర్ 2026, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్
ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...
-
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...