6, జూన్ 2026, శనివారం

ఉచిత కేన్సర్ పరీక్షలు@ కదిలే బస్ లో

 కేన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు, మహిళల కోసం ఉచితంగా 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు, కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే 50% ఖర్చు తగ్గించే వైద్యము, రేపటి నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి ప్రారంభం. 



మనకు తెలియకుండానే చెప్పకుండా నీరులా వ్యాపిస్తున్న వ్యాధులలో క్యాన్సర్ ప్రధానమైనది శరీరంలో కణ వ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది అయితే కేన్సర్ వస్తే ఇక అంతేనా అని దీనికి మందు లేదని చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తిస్తే నియంత్రించొచ్చు, ప్రారంభ దశలోనే గుర్తించేందుకు వైద్య పరికరాలతో ప్రత్యేక బస్సును అందుబాటులోకి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు తీసుకొచ్చారు ఈ బస్సు ద్వారా పల్లెలలో పట్టణాల్లో మహిళలకు స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు కేన్సర్ ఉన్నట్టు తెలిస్తే ప్రముఖ కేన్సర్ ఆసుపత్రుల్లో 50% మేరా ఖర్చు రాయితీతో వైద్యం చేయించాను అన్నారు అందులో భాగంగా ఆదివారం నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలు ఉన్నారు 

ఉచితంగా వైద్య పరీక్షలు.. బీడీఎల్ వారి సౌజన్యంతో బస్సు శిశిర ఆస్పత్రి వారి సహకారంతో వైద్య పరీక్షల సామాగ్రిని సమకూర్చారు ఆ తర్వాత ఉచిత కాన్సర్  స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు ఇటీవల ఈ బస్సును లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారు ప్రారంభించారు హైదరాబాద్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు, ఆంకో సర్జన్ డాక్టర్ స్రవం తేజ నేతృత్వంలో పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు నుంచి 20వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు ఉచితంగా అందించనున్నారు మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 45 మండలాలు 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లోని 9 డివిజ డివిజన్ లలో క్యాన్సర్ టెస్టింగ్ బస్ సంచరించనున్నది. ఎక్కడికి వెళ్లినా ముందుగా అక్కడ ప్రజలకు సమాచారం అందిస్తారు మహిళలకు బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేస్తారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కేన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా కోలుకుంటారని మహిళలు ఎక్కువగా బ్రష్టు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఈ బస్సు లోక్ లోక్భ సభ నియోజకవర్గంలో అంతటా సంచరిస్తుందని అక్కడే టెస్టు నిర్వహించే రిపోర్టులు అందజేస్తారని మహిళలందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఎంపీ మాధవిని రఘునందన్ రావు గారు కోరారు.

ఉచిత స్టీల్ ప్లేట్ల పంపిణీ

 బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామానికి చెందిన తపస్సు జిల్లా అధ్యక్షుడు బోనీకర్ సంతోష్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి ఉపయోగపడేలా 100 స్టీల్ ప్లేట్లను గ్రామ సర్పంచ్ భూమిక జ్యోతి కి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరిగే శుభకార్యాలు సామాజిక కార్యక్రమాలకు ఈ ఉచిత స్టీల్ ప్లేట్లను వినియోగించాలన్నారు అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ దోహదపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలను సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శనీయమన్నారు సేవా కార్యక్రమాలు మరిన్ని మున్ముందు చేపట్టాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామస్వామి జయ వీరప్ప డాక్టర్ రవి కమార్ సంతోష్ పటేల్ గాండ్ల శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

5, జూన్ 2026, శుక్రవారం

కీళ్ల ఆరోగ్యంపై ఉచిత పుస్తకం

 


మారిన జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయి వీటి పట్ల ఒక మంచి అవగాహన అందించే ఉద్దేశంతో స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒక కీలకమైన ప్రజారోగ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు.

"ది హ్యూమన్ బోన్ జాయింట్స్ ఎక్స్ ప్లెయిన్డ్ "అనే పేరుతో రూపొందించిన ఈ ఉచిత పుస్తకాన్ని బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్స్ లో గురు వారం విడుదల చేశారు. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. నీలం వి రమణారెడ్డి 25 సంవత్సరాల సుదీర్ఘ క్లినికల్ , రోబోటిక్ అనుభవంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఆయన చికిత్స ద్వారా నొప్పుల నుండి విముక్తి పొంది తిరిగి సాధారణ జీవితం గడుపుతున్న ముగ్గురు లబ్ధిదారులు అయిన రోగులే ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉచిత పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం..

కీళ్ల కండరాల పని తీరును , కీళ్లు ఎందుకు శబ్దాలు చేస్తాయనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.

బరువు నియంత్రణ,ఒమేగా 3 , ఆహార నియమాలు, కూర్చునే పద్ధతులు, మరియు ఈత,సైక్లింగ్ వంటి వ్యాయామాల గురించి నిపుణులు సలహాలు అందించారు. వేళ్ళు తిరగడం వల్ల ఆర్థరైటిస్ రాదనే నిజాలను స్పష్టం చేస్తూ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల మన్నిక పై ఉన్న భయాలను తొలగించారు..

రోబోటిక్ శస్త్ర చికిత్సలు, వేగంగా కోలుకోవడంలో కృత్రిమ మేధ పాత్రను వివరించారు.జీవించడం అంటే కదలడం..మీరు ఎప్పటికీ చేయించుకోవాల్సిన అవసరం రాని శస్త్ర చికిత్స యే ఎల్లప్పుడూ అత్యుత్తమమైనది అని డా రమణా రెడ్డి పేర్కొన్నారు.

31, మే 2026, ఆదివారం

హైదరాబాద్ లో ఉచిత ఫిజియోథెరపీ చికిత్స

 

చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల  నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వాత కదల్లేని వారికి సంజీవనిలాంటిది ఫిజియోథెరపీ చికిత్స. చాలా వ్యాధులలో అవసరమయ్యే ఫిజియోథెరపీ ని క్రమం తప్పకుండా రోగులకు అందజేస్తే రోగాలు పెరగకుండా వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.ఐతే చాలా మందికి ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల,చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల,ఖర్చు ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో ఫిజియోథెరపీ కి దూరంగా ఉంటుంటారు.అలా రోగాలు తగ్గకపోవడం ,సమస్యలు పెరగడం జరుగుతుంటాయి.

అందుబాటులో ఆధునిక మందులు ఎన్ని ఉన్నా,కొన్నింటికి ఫిజియోథెరపీ చికిత్స తప్పనిసరి.కానీ ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పని.ఐతే పేదలకు ఉపయోగపడే ఉద్దేశం తో ఈ ఖరీదైన సేవలను ఉచితంగా అందిస్తోంది ఒక స్వచ్ఛంద సంస్థ.

కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ కు చెందిన కొలసాని హరీష్ అనే వ్యక్తి చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిర పడ్డారు. మంచి జీతంతో జీవితం విలాస వంతంగా గడుస్తున్నప్పటికీ సంతృప్తి చెందలేదు. తను పుట్టిన మాతృ భూమికి ఏదైనా చేయాలని తపించాడు. ఆ తపన లో నుండి పుట్టినదే ఈ ఉచిత ఫిజియోథెరపీ అందించాలనే ఆలోచన.అలా 2012 లో " ఎన్ ఆర్ ఐ సేవా ఫౌండేషన్ "అనే ఎన్జీవో ను స్థాపించారు ఆయన.

మొదట మురికి వాడల్లో వైద్య శిబిరాలు నిర్వహించాడు.మంచానికి పరిమితమైన వారికి" మొబైల్ అంబులెన్స్ " ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో పేదల దీన స్థితిని, ఆర్థిక ఇబ్బందులను గమనించాడు.వారికి ఫిజియోథెరపీ చికిత్స ను పెద్ద ఎత్తున అందించాలని సంకల్పించాడు. ఈ విషయంలో తన సన్నిహితులతో సంప్రదిస్తే ..ఇప్పటికే చాలా చేస్తున్నావు, ఇది అవసరమా అని నిరాశకు గురి చేశారు వారు.

కానీ ప్రసాద్ గారు వెనుకడుగు వేయకుండా 2013లో వివేకానంద నగర్ లో ఒక ఫిజియోథెరపీ కేంద్రాన్ని ప్రారంభించారు. డ్రైనీ డీలింగ్, అల్ట్రా సౌండ్,టెన్స్, ఇంటరా వెర్షన్ ఫెరెన్షియల్ థెరపీ, మజిల్ స్టిమ్యులేటర్,ట్రాక్షన్ పారాఫిన్ వ్యాక్స్, ఐ ఆర్ ఆర్ ల్యాంప్, ఫిజియో బాల్, ల్యాడర్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచాడు. కార్పొరేట్ కు ధీటుగా సేవలు అందిస్తుండడంతో సమాజం నుంచి మంచి స్పందన లభించింది.2017 లో మోతీ నగర్ లో మరో కేంద్రాన్ని స్థాపించాడు. కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు అంటూ వచ్చిన వారిని ఎవరినీ ఊరికే వెనక్కి పంపించరు.రోగులు ఎక్కడి వారైనా, ప్రిస్క్రిషన్ రాసింది ప్రభుత్వ వైద్యుడా, ప్రైవేట్ వైద్యుడా అని చూడకుండా.. ప్రిస్క్రిప్షన్ ఉంటే చాలు , కేంద్రంలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు.సమస్యను బట్టి ఎన్ని రోజులైన ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ రెండు కేంద్రాలకు కలిపి ప్రతి రోజూ దాదాపు 250 నుండి 300 వరకు రోగులు వస్తుంటారు. హైద్రాబాద్ నుండే కాకుండా , రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల నుంచి రోగులు వరుస కడుతున్నారు.

తన తల్లికి అనారోగ్యంతో ఫిజియోథెరపీ చికిత్స అందించడంలో ఎదురైన ఇబ్బందులను గమనించి, ఫిజియోథెరపీ చికిత్స ప్రాధాన్యత గుర్తించి ఈ ఎన్జీవో స్థాపించినట్లు హరీష్ తెలిపారు.ఇప్పటివరకు 14 లక్షలకు పైగా రోగులకు చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు.ఇందుకోసం నెలకు దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉచిత కుట్టు మిషన్లు పంపిణి

 


నిజామాబాద్ నగరంలోని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో వెనుకబడిన మహిళల సాధికారత కొరకు స్థానిక అభ్యాస పాఠశాలలో రోటరీ ఆసరా కార్యక్రమం ద్వారా ఉచితంగా 60 కుట్టుమిషన్లను అలాగే వీటితో పాటు 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహ రావు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఒక మహత్తర సేవ కార్యక్రమానికి సాక్షులుగా నిలుస్తున్నామని ,ఆసరా పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా సర్వీస్ ఈవెంట్ ద్వారా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు 60 కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .ఇది ఒక సహాయం మాత్రమే కాదు అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసాన్ని ఉపాధిని మంచి భవిష్యత్తును అందించే ఒక గొప్ప ప్రయత్నం తెలిపారు. మహిళా సాధికారత అనేది సమాజాభివృద్ధికి మూల స్తంభం అని పేర్కొన్నారు. మహిళ ఆర్థికంగా బలపడితే వారి కుటుంబం బలపడుతుందని దానితో పాటు సమాజం అభివృద్ధి చెందు తుందని ,ఈ ఆలోచనలతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సభ్యులందరూ అభినందనీయులు తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ వి రాంప్రసాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్ ఐ డి 3150, గౌరవ అతిథులుగా ఆర్టీవో కే రాజేంద్ర కుమార్ నిజామాబాద్ పి డి జి రమేష్ వంగాల ,రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కె ఎస్ ఆర్  ప్రసాద్ ,రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొనగా ,ప్రాజెక్టు చైర్మన్గా రొటేరియన్ డాక్టర్ పి విష్ణు బాబు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ రొటేరియన్ రంజిత్ సింగ్ ఠాకూర్  పాల్గొన్నారు అని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మరియు రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి సంగులూరు లు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ సెక్రెటరీ లక్ష్మీ విసిరెడ్డి ,రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ సెక్రటరీ గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్ ,రొటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

27, మే 2026, బుధవారం

1.5 లక్షల ఉచిత చికిత్స..రోడ్డు ప్రమాద బాధితులకు

 ఆపదలో బాధితులకు భరోసా.. రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం కింద ఒకటిన్నర లక్షల రూపాయల ఉచిత చికిత్స.. కానీ సరైన ప్రచారం లేక బాధితులకు చేరువ కాని పథకం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో గాయపడిన బాధితులకు ఎలాంటి డబ్బులు డిపాజిట్ చేయకుండా తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అశ్యురుడు ట్రీట్మెంట్ స్కీం.. పథకాన్ని అమలు చేస్తోంది. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రులలో చేర్పిస్తే చికిత్స ఖర్చులకు  ఎవరు డిపాజిట్ డబ్బులు కట్టాలని చాలామంది క్షతగాత్రులకు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధితులను ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తే బాధ లేదు ,కానీ ప్రైవేట్ ఆస్పత్రులలో చేర్చాల్సి వస్తే వారి చికిత్స కోసం డబ్బులు కట్టి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఈ పథకాన్ని ప్రారంభించింది. 

ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటిన్నర లక్షల రూపాయల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజులపాటు చికిత్సకు ఈ పథకం ద్వారా సహాయం లభిస్తుంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఎం ప్యానెల్డ్/ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ఉన్న ఆసుపత్రులలో బాధితులు ముందుగా డబ్బులు చెల్లించకుండా చికిత్స పొందవచ్చు. ఈ ఆసుపత్రులలో బాధితుల చికిత్స కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. జాతీయ రహదారుల పైనే కాకుండా పట్టణ గ్రామీణ రహదారులపై జరిగిన ప్రమాదాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఎంతటి కోటీశ్వరులైన ఈ పథకం ద్వారా ఒకటిన్నర లక్షల వరకు నగదు రహిత చికిత్సను పొందవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవాలి.. ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా 112 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమీప ఆస్పత్రి వివరాలు ,అంబులెన్స్ సహాయం పొందవచ్చు.

ప్రమాదం వివరాలు తెలియగానే వాటిని ఈ-దార్ హోటల్ ద్వారా నమోదు చేస్తారు.

ఈ - దార్ పోర్టల్ అంటే..

ఈ - దార్ ( ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ ఆక్సిడెంట్ రిపోర్ట్ ) పోర్టల్ ద్వారా పోలీస్ ,వైద్య,రోడ్డు రవాణా శాఖ , బీమా సంస్థ లు అనుసంధానమై ఉండి ప్రమాద వివరాలను పంచుకుంటాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే..

పోలీసులు ప్రమాద వివరాలు,డ్రైవర్,వాహనం వివరాలు నమోదు చేస్తారు.ప్రమాదం ఫోటోలు ,వీడియోలు పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

వైద్యులు దగ్గరిలోని ఆసుపత్రుల వివరాలు అందించి, ఆసుపత్రిలో బాధితులను చేర్పించాక , గాయాల సమాచారం నమోదు చేస్తారు.

రవాణా శాఖ ప్రమాదం వివరాలు తెలుపుతూ బీమా కంపెనీలకు సమాచారం ఇస్తారు. ఆసుపత్రులకు చికిత్స ఖర్చులు చెల్లించేలా చర్యలు చేపడతరు.

బీమా కంపెనీలు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు. 

సత్వర వైద్యం అందుబాటులోకి..

కేంద్ర ప్రభుత్వ పియం రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులు ప్రభుత్వ మరియు ఎంపానల్డ్ అంటే ఆరోగ్యశ్రీలో నమోదైన ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు కట్టకుండా 1.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ప్రమాదం జరగగానే వివరాలను ఈదార్ పోర్టల్ లో నమోదు చేస్తారు

ఈ పోర్టల్ లో వైద్య రవాణా పోలీసు శాఖలు అనుసంధానంగా ఉండడంతో సత్వర వైద్యము చికిత్స ఖర్చుల చెల్లింపు ఆసుపత్రులకు త్వరితగతిన జరుగుతాయి. ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా.

ఈ పథకానికి సరైన ప్రచారం జరగడం లేదు..

ఈ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13 న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ గా వైద్యుల పరిభాషలో పిలువబడే ప్రమాదం జరిగిన మొదటి గంట సమయం లోపు ఎలాంటి ఖర్చు లేని వైద్య సహాయం అందించడం. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రాణాపాయం లేని స్థితిలో ఉంటే 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో ఉంటే 48 గంటల వరకు ఈ పథకం ద్వారా " ఉచిత అత్యవసర వైద్యం " అందుతుంది.





ఉచితంగా స్టీల్ బాక్స్ ల పంపి

 లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ ప్లాస్టిక్ నిషేధానికి గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ బాక్సులు గ్లాసులకు బదులుగా స్టీల్ గ్లాసులు ,స్టీల్ బాక్సులు వాడాలని గ్రామస్తులకు స్టీల్ బాక్సులు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. హోటల్స్ నిర్వాహకులకు గాజు గ్లాసులు వాడాలని వారికి గ్లాసులను పంపిణీ చేశారు ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ప్రకటించేందుకు గ్రామస్తులు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఉప సర్పంచ్ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు.

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...