20, అక్టోబర్ 2026, మంగళవారం

ఉచితంగా స్పేస్ ఎక్స్ కంపెనీ షేర్లు..

 అమెరికా చిన్నారులకు ..ఉచితంగా స్పేస్ ఎక్స్ షేర్లు..

అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి తన" స్పేస్ సెక్స్ కంపెనీ ఒక షేర్  ఉచితంగా " ఇస్తానని బిలియన్ ఎలాన్ మస్క్ సోమవారం ప్రకటించారు. కృత్రిమ మేధా సంస్థ ఆంత్రోపిక్ తమ షేర్లలో  ఐదు శాతాన్ని ఒక కొత్త పబ్లిక్ బెనిఫిట్ ఫండ్ కు కేటాయిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. స్పందించిన మస్క్ ..షేర్లను నేరుగా ప్రజలకే ఇవ్వాలని సూచించారు. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడై , మరో ఐదుగురు సహ స్థాపకులు ఈ పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ నవంబర్ నాటికి ఈ కంపెనీ భారీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్( ఐపిఓ) తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. 

గూగుల్, అమెజాన్ వంటి సంస్థల దిగ్గజాల సరసన స్పేస్ ఎక్స్ కూడా జూన్ లో వాల్ స్ట్రీట్ లో పబ్లిక్ గా ట్రేడ్ అయ్యే కంపెనీగా అడుగు పెట్టింది. ఈ పరిణామం తో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అవతరించారు. 

19, అక్టోబర్ 2026, సోమవారం

ఎస్టీ ఐఎఎస్ స్టడీ సర్కిల్, రాజేంద్ర నగర్, హైద్రాబాద్.

 హైదరాబాదులోని రాజేంద్రనగర్ లోని మానస హిల్స్ లో తెలంగాణ ప్రభుత్వ ట్రైబల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కొనసాగుతోంది .ప్రతి సంవత్సరం 100 మంది పేద ఎస్టి విద్యార్థులకు ప్రభుత్వం" ఉచితంగా సివిల్స్ కోచింగ్ " అందిస్తోంది. ఫ్రీ హాస్టల్, ఫ్రీ బుక్స్ కోసం ప్రత్యేకంగా స్టైపండు , నెలవారీ  ప్యాకెట్ మనీ తో పాటు కంప్యూటర్ ల్యాబ్ ,లైబ్రరీ, రీడింగ్ హాల్ వంటి వసతులు కల్పిస్తున్నారు. 

ఒక్కో విద్యార్థిపై సుమారు లక్ష రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే గత ఐదేళ్ల నుంచి ప్రతి ఏటా ఈ స్టడీ సర్కిల్ నుంచి 120 మంది సివిల్ ఎగ్జామ్స్ రాస్తుండగా ఇందులో కేవలం పదిమందిలోపే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవుతున్నారు. మెయిన్స్ లో మాత్రం ఒక్కరు కూడా సెలెక్ట్ కావడం లేదు. దీంతో ఈసారి ప్రైవేట్ స్టడీ సర్కిల్కు కోచింగ్ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017- 18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 734 మంది శిక్షణ పొందగా 131 మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. 

పేద ఎస్టీ విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇచ్చేందుకు ట్రైబల్ శాఖ ఇటీవల టెండర్ల ను పిలవగా ఇందులో ఆరు ప్రముఖ స్టడీ సర్కిల్ లు పాల్గొన్నాయి. తక్కువగా కోట్ చేసిన ఢిల్లీ శ్రీరామ్ ఐఏఎస్ సర్కిల్ టెండర్ దక్కించుకుంది. ఒక్కొక్క స్టూడెంట్ కు 60 వేల రూపాయలకే ప్రిలిమ్స్, మెయిన్స్ కోచింగ్  ఇచ్చేలా టెండర్ లో ఎల్ 1 గా నిలిచింది. ఇతర సంస్థలు 1 లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు కోట్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థలో విద్యార్థులకు 24 గంటల ఉచిత వైఫై, 60 కంప్యూటర్లతో వేర్వేరు కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి .ప్రతి విద్యార్థికి 5000 రూపాయల విలువైన" స్టడీ మెటీరియల్ ఉచితంగా"  అందజేస్తున్నారు. ప్రొజెక్టర్లు ,స్క్రీన్లతో కూడిన 5 పెద్ద క్లాసు రూమ్ లలో నిపుణులైన ఫ్యాకల్టీ తో ఐఏఎస్ మెయిన్స్ ఆప్షనల్ సబ్జెక్టులపై కోచింగ్ ఇస్తున్నారు. 

పేద గిరిజన విద్యార్థులకు సివిల్స్ ర్యాంకులు సాధించే లక్ష్యంతో ట్రైబల్ శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తొలిసారిగా టెండర్ ద్వారా ఢిల్లీ శ్రీరామ్ సివిల్స్ స్టడీ సర్కిల్ కు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది .దసరా సెలవుల తర్వాత నుంచి వచ్చే ఏడాది మేలో ప్రిలిమ్స్ పరీక్ష జరిగే వరకు 8 నెలల పాటు" 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ"  ఇవ్వనున్నారు. అలాగే గతేడాది ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన మరో 20 మందికి" ఉచిత మెయిన్స్ శిక్షణ" అందించనున్నారు. దీని ద్వారా రాబోయే రోజులలో మరిన్ని సివిల్స్ ర్యాంకులు పేద గిరిజన విద్యార్థులు సాధించేలా అంతర్జాతీయ స్థాయి మెంటార్ షిప్ బోధన అందనున్నది.

10, అక్టోబర్ 2026, శనివారం

మదర్ థెరిస్సా స్కూల్,ఫ్రీ హాస్టల్@పాడియనల్లూరు, తమిళనాడు

 తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని పాడియ నల్లూరు కు చెందిన సెల్వకుమార్ ఒక అధ్యాపకుడు.. కళాశాలల్లో పాఠాలు చెప్పడం తోనే సరిపెట్టుకోలేదు. అనాథ పిల్లల ఆకలి తీర్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. 23 ఏళ్లుగా షూ పాలిష్ చేస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. పలు కాలేజీల్లో పార్ట్ టైమ్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. 

2003 లో అనాథ పిల్లల కోసం " మదర్ థెరిస్సా" పేరిట ప్రాథమిక పాఠశాల స్థాపించారు.భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న మహిళల పిల్లలు , పేద విద్యార్థులను తన బడిలో చేర్చుకుని తక్కువ ఫీజు తీసుకుంటున్నారు.

అనాథ పిల్లల కోసం " ఉచిత హాస్టల్ " నిర్వహిస్తున్నారు. వీటికయ్యే ఖర్చుల కోసం గతంలో ఇంటింటికి వెళ్లి బియ్యం, ఇతర వస్తువులు సేకరించేవారు. 2005 నుండి బస్టాండ్, రైల్వే స్టేషన్, రోడ్ల కూడళ్లలో కూర్చుని పాదరక్షల కు పాలిష్ చేస్తూ నిధులు సమీకరిస్తున్నారు. ఈ వృత్తి తక్కువ స్థాయిది కాదు అని తెలియచేయడం కోసమే దీన్ని ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

ఫ్రీ మీల్స్ @ అసద్ - అన్వర్ ట్రస్ట్, హైద్రాబాద్

 అసద్ - అన్వర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 1.6 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్టు ట్రస్ట్ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం హుస్సేనీ ( ముజీబ్ ) తెలిపారు. 

హైద్రాబాద్ లోని నాంపల్లి లో గల ఎం ఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ లోని రోగులకు ,సహాయకులకు తమ ట్రస్ట్ ద్వారా " ఉచితంగా అన్నదానం " చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని అన్న ప్రసాదాన్ని రోగులకు, వారి సహాయకులకు అంద చేశారు. 

తన తల్లి దండ్రులైన అసదుద్దీన్, అన్వరున్నిసా స్మారకార్థం ప్రతి వారం ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.

9, అక్టోబర్ 2026, శుక్రవారం

ప్రతి ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం..

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న బాంబే క్లాత్ హౌజ్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న " ఉచిత కంటి వైద్య శిబిరం" కామారెడ్డి నియోజక వర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణా రెడ్డి గారు కోరారు. సంబంధిత ప్రచార ఫ్లెక్సీలను ఆయన ఆవిష్కరించారు. 

వైద్య శిబిరంలో ఆపరేషన్లు అవసరమైన వారికి " వీటీ ఠాకూర్ లయన్స్ ఆసుపత్రి లో " ఉచితంగా చికిత్సలు చేస్తామని ప్రతినిధి శ్రీ వీటీ లాల్ గారు తెలిపారు. బాంబే క్లాత్ హౌజ్ యాజమాన్యం తమ లాభాల్లో కొంత పేదలకు కేటాయించి సేవా కార్యక్రమాలను చేపట్టడం పట్ల ఎమ్మెల్యే అభినందించారు. 

ఉచిత శిక్షణ @ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కామారెడ్డి

 ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులకు ఇస్తున్న ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్వాయి ఉప సర్పంచ్ పర్వా రెడ్డి అన్నారు. ఫౌండేషన్ సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత శిక్షణ కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యురాలు సంగీత మాట్లాడుతూ 18-35 ఏళ్ల లోపు వారికి కామారెడ్డి లో హెల్త్ కేర్ కు సంబంధించి బీడీఏ కోర్స్ అందుబాటులో ఉందని 90 రోజులు ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందించనున్నారని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 

ఆసక్తి గల అభ్యర్థులు 91775 64914 నంబర్ లో సంప్రదించాలని సూచించారు. మాజీ సర్పంచ్ అరవింద్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ , మాజీ ఉప సర్పంచ్ నర్సింలు , గ్రామస్తులు పాల్గొన్నారు. 

5, అక్టోబర్ 2026, సోమవారం

ఉచిత శిక్షణ.. ఇన్ఫోసిస్ తో..

 ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఖమ్మం లో డిగ్రీ పూర్తి చేసిన యువతకు ఉచితంగా శిక్షణ అందజేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు లెర్నెట్ స్కిల్స్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ మత్తి రామకృష్ణ తెలిపారు. ఈ శిక్షణకు 18 సంవత్సరాలు నిండి 28 సంవత్సరాల లోపు డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. 

ఈ శిక్షణను అనుభజ్ఞులైన ట్రైనర్లచే 90 గంటలు అందచేసి శిక్షణలో పాల్గొన్నవారికి ఉచితంగా మెటీరియల్ అందచేసి అనంతరం ఇన్ఫోసిస్ వారి సర్టిఫికెట్ అందచేసి ఉద్యోగ అవకాశం కల్పించబడునని తెలిపారు. 

పూర్తి సమగ్ర వివరాలకు 99124 65999 లో సంప్రదించాలని సూచించారు.

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...