క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని హైదరాబాద్ మెడి కవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజిస్టులు సూచించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో "ప్రతి నెల రెండో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని" నిర్వహించనున్నట్లు మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డాక్టర్లు.. డాక్టర్ అన్వేష్, డాక్టర్ నీలేష్ ,డాక్టర్ స్నేహ తెలిపారు. గురువారం హాస్పిటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పాల్గొని మాట్లాడారు.
కరీంనగర్ మెడి కవర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన మొదటి ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇకపై" ప్రతినెలా రెండో గురువారం" కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని "నిర్వహించాలని నిర్ణయించినట్లు డాక్టర్లు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి అన్నారు. హాస్పిటల్ లో కల్పించిన ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో ముఖ్యంగా "బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా " నమోదు అవుతున్నాయని తెలిపారు. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందన్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలి దశలో గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు అన్నారు.
క్యాన్సర్ బారిన పడకుండా కొంతమంది నైనా కాపాడాలనే ఉద్దేశంతో మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం" ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలని " నిర్వహిస్తోందని వైద్యులు తెలిపారు. ముందస్తు గుర్తింపు, సరైన సమయంలో చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా క్యాన్సర్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ సంపత్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, పిఆర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి