కేర్ హాస్పిటల్స్ వారు నిర్వహించే స్వస్థ్ రథ్ ద్వారా సేవలు పొందే వారికి కేర్ సంఘం మరియు సీనియర్ సిటిజెన్ల కోసం ప్రణాం కార్యక్రమాల్లో "ఉచిత సభ్యత్వం" కల్పించనున్నారు . ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షాలను చేరువ చేయడంతో పాటు నివారణ ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకు కేర్ హాస్పిటల్ స్వస్థ్ రథ్ కార్యక్రమం ప్రారంభించింది. మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ లో ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ స్వస్థ్ రథ్ జండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐ మురారి ,ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల, డాక్టర్ శ్రీధర్ సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్వస్థ్ రథ్ హైద్రాబాద్ లో వివిధ ప్రాంతాలలో పర్యటించనున్నది. కాలనీ లో కమ్యూనిటీ కేంద్రాలు, నివాస ప్రాంతాలు, పార్కులు, సీనియర్ సిటిజన్ క్లబ్బులు తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య పరిక్షలు నిర్వహించడంతోపాటు నివారణ, ఆరోగ్యం పై అవగాహన కల్పించనున్నది. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, అవసరమైనప్పుడు సకాలంలో వైద్యులను సంప్రదించడం పై ప్రజలకు సూచనలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్హాసన్ ఎఫెండీ మాట్లాడుతూ ఆరోగ్య సేవలు ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రయోజనం అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాలనీలు, కమ్యూనిటీ ప్రాంతాల్లోనే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు అందించడం మంచి కార్యక్రమం అన్నారు. ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ స్వస్థ్ రథ్ ద్వారా ప్రజలు నివసించే ప్రాంతాలకే ప్రాథమిక ఆరోగ్య పరీక్లను తీసుకెళ్తున్నాం. ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్షలు చేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే మా లక్ష్యం అన్నారు. కేర్ హాస్పిటల్స్ చేపడుతున్న" కేర్ సంఘం " సీనియర్ సిటిజెన్ల కోసం" ప్రణాం" కార్యక్రమాలలో ఉచిత సభ్యత్వం కల్పించనున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్
ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...
-
భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి