గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నగరాలలో వసతి గృహాల్లో ఉంటూ కోచింగ్ తీసుకోవడం ఆర్థికంగా పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా గ్రామీణ విద్యార్థులు తమ ఊరిలో ఉంటూనే ప్రముఖ కోచింగ్ సెంటర్ లలో ఆన్ లైన్ కోచింగ్ పొందడానికి సహకరించాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అభ్యర్థించారు.
ఈ విషయమై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రతి ఒక్క విద్యార్థికి రూ.40,000 వేల విలువ గల ఆన్ లైన్ కోచింగ్ యాక్సెస్ ను " పీ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా" అందించనున్నట్లు తెలిపారు. ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులైనా తమ పీ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదిస్తే" 40 వేల రూపాయల విలువ చేసే ఆన్ లైన్ కోచింగ్ యాక్సెస్ ను ఉచితంగా" అందిస్తామని తెలిపారు.ఈ నెల 28 నుండి ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.ఎన్నో రకాలుగా ఆర్థిక భారం తప్పుతుందని, విద్యార్థులు ఎటువంటి చింత లేకుండా తమ ఊరిలో ఉంటూనే ఆన్ లైన్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరారు. ఇప్పటికే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు ఉచిత శిక్షణ కొనసాగుతోందని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి