26, అక్టోబర్ 2026, సోమవారం

ఉచిత కాశీ మరియు అయోధ్య యాత్ర

 కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ వద్ద గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైశ్య నిరుపేద భక్తుల కోసం ఏర్పాటుచేసిన" అయోధ్య మరియు కాశి ఉచిత యాత్ర " కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ నగర మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గంప శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర మూడవ సంవత్సరానికి చేరుకోవడాన్ని అభినందించారు. వైశ్య నిరుపేద భక్తుల కోసం గంప శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో ఈ యాత్రను ఏర్పాటు చేయడం, సుమారు 8 రోజుల పాటు సాగే యాత్ర కోసం ప్రత్యేకంగా రెండు బస్సులను ఏర్పాటు చేసి దాదాపు 45 కుటుంబాల సభ్యులను "అయోధ్య, కాశీ క్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లడం"  చాలా గొప్ప విషయం అన్నారు. యాత్రకు బయలుదేరిన భక్తులకు ఎలాంటి  అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారని అన్నారు. అయోధ్య రాముడు మరియు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో భక్తుల యాత్ర సుఖంగా సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, వైశ్య సంఘం ప్రతినిధులు, బిజెపి నాయకులు మరియు యాత్రకు బయలుదేరిన భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...