డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఫ్యూచర్ రెడీ స్కిల్లింగ్ అండ్ ఇన్నోవేషన్ కార్యక్రమం ద్వారా ఐటీఐ లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, లేదా ఏదేని ట్రేడ్ పూర్తి చేసిన వారికి ఫార్మా మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సి. రాఘవేందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్ సీ వీ ఈ టీ గుర్తింపు పొందిన ఈ కోర్సులో శిక్షణ తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. వీరితో పాటు ఇంటర్ ( ఎంపీసీ, బిపిసి), ఫార్మా, MLT, ఐటీఐ ఏదేని ట్రేడ్, డిప్లొమా చేసిన 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగులు శిక్షణ కు అర్హులని తెలిపారు. 3 నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుందని , దూర ప్రాంతాల అభ్యర్థులకు వసతి సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు.
పూర్తి సమగ్ర వివరాలకు 80190 50334, 91001 31017, 8886771981,92475 73293 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని సూచించారు.