26, అక్టోబర్ 2026, సోమవారం

నిరుపేదలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ

 బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సర్జరీలు..

ప్రమాదవశాత్తు శరీరం కాలిపోయి తీవ్ర గాయాల పాలైన నిరుపేద బాధితులకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నట్లు బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ / బి ఎస్ ఎం ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. పెగా సిస్టం సంస్థ ఆర్థిక సహకారంతో చేపట్టనున్న ఈ సేవా కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమై ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని వారు తెలిపారు. ఖరీదైన ప్లాస్టిక్ సర్జరీలను భరించలేక చికిత్సకు దూరంగా ఉంటున్న బాధితుల కోసం ముందుకొచ్చిన పెగా సిస్టం సంస్థకు ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలను ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మాటిక్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరగనున్నట్లు వారు తెలిపారు.

కాలిన గాయాల బాధితులకు అండగా నిలుస్తూ వారికి పునరావాసం కల్పించేందుకు నిహారి మండలి చేస్తున్న కృషి గొప్పది.2009 లో తీవ్ర కాలిన గాయాలకు గురైన తాను ఆర్థిక ఇబ్బందుల వల్ల అవసరమైన సర్జరీలు చేయించుకోలేక పోయానని , తర్వాత జర్మనీ వైద్యుల సహకారంతో ఉచితంగా శస్త్ర చికిత్సలను చేయించుకున్నట్లు తెలిపారు.

ఆ కష్టాలు మరెవరికీ వద్దన్న సంకల్పం తో " బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్" 2014లోస్థాపించానని.. కార్పొరేట్ సంస్థ ల సహకారం తో 420 ఉచిత శస్త్ర చికిత్సలు చేయించినట్లు ఆమె తెలిపారు . బాధితులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని ఆమె పేర్కొన్నారు.

 పెగా సిస్టం సంస్థ సహకారంతో " బర్న్స్ టు షైన్ - 2026 " కార్యక్రమం చేపట్టానని,ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలోని అర్హులైన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ల కోసం 7680974918 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని కోరారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఫ్రీ గణపతి అర్చన@వేదమందిర్

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేద మందిర్ వారు ఇప్పుడు ఫ్రీ గా , 100% ఉచితంగా మీ పేరు మీద " గణపతి అర్చన" జరుపుకునే అవకాశం కల్పిస్త...