గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా . రమణ దన్నపనేని , సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షించి , అవసరమైన వైద్య పరీక్షల అనంతరం సర్జరీ అవసరమున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం , సీ ఎం ఆర్ ఎఫ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఐదేళ్లుగా ఏటా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ తన వార్షిక సోషల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను అందించనుంది.పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.
అర్హత గల చిన్నారుల తల్లి దండ్రులు సోమ వారం నుంచి శని వారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తు లోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.
ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే చిన్నారులతో నిమ్స్ కు రావచ్చని తెలిపారు.
గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు , సంబంధిత పత్రాలు ఉంటే వెంట తీసుకుని రావాలని, మరిన్ని సమగ్ర వివరాలకు 040-23489025 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి