గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలన లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల కిశోర బాలికల కు" HPV టీకాను ఉచితంగా" అందిస్తోంది. దేశంలోని అన్ని జిల్లాల లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సరైన అవగాహన లేకుండా ఎంతో మంది స్త్రీలు కాన్సర్ బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని, ఈ అకాల మరణాలను నివారించడానికి, భారత దేశం నుండి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను తరిమి కొట్టడానికి , ఆరోగ్య భారతాన్ని నెలకొల్పడానికి " ఉచిత వాక్సినేషన్ " అద్భుత మార్గమని పేర్కొన్నారు.
కావున ప్రజలు విస్తృత ప్రచారం కల్పించి ,అవగాహన పెంచి " ఉచిత వాక్సినేషన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి