Saturday, 4 April 2026

6 న ఉచిత ఉద్యోగ మేళా

 కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నల ఆరవ తేదీన ఇటువంటి కన్సల్టెన్సీ ఫీజులు లేకుండా ఉచితంగా ఉద్యోగమేళా ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ జయకుమారి తెలిపారు హైదరాబాద్ కు చెందిన వివిధ రకాల సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది అన్నారు కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభం అవుతుందని ఆసక్తి గల యువతీ యువకులు తగిన ధ్రువపత్రాలతో జాబ్ మేళా కు  రావాలని సూచించారు.

Friday, 3 April 2026

టెక్నికల్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

 ఈనెల 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి 

భూదాన్ పోచంపల్లి మండలంలోని జలాల్పురం లో గల స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి తెలిపారు .

ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్సు కు ఐటిఐ..

 కంప్యూటర్ హార్డ్వేర్, సీసీటవీ ,సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్సులకు పదవ తరగతి ..

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజి క్విల్ట్ మేకింగ్ కోర్సులకు ఎనిమిదవ తరగతి కలిగి ఉండాలని తెలిపారు .

అభ్యర్థులు తమ విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో ఈ నెల ఆరవ తేదీ లోపు సంస్థలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో భోజనం, వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు.

 పూర్తి వివరాలకు 9133 90 8,000 మరియు 9133 90 8 111 నంబర్లలో సంప్రదించాలని సూచించారు

జామియా మిలియా లో సివిల్స్ కు ఉచిత శిక్షణ

 జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నిరుపేద ,మధ్యతరగతి విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది.

 2027 లో యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్న మైనారిటీ, ఎస్సీ, ఎస్ టీ , మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఈ ఉచిత శిక్షణ పొందేందుకు విశ్వవిద్యాలయం జూన్ 6న హైదరాబాద్లో అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, దీంట్లో మెరిట్ సాధించిన వారికి ఒక ఏడాది పాటు ఉచిత శిక్షణ, భోజన వసతితో పాటు పూర్తిస్థాయిలో లైబ్రరీ సౌకర్యం కూడా కల్పిస్తారని వెల్లడించారు .

అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను https ://admission.jmi.ac.in  వెబ్సైట్లో మే 26 లోపు ఒక వెయ్యి 325 రూపాయల ప్రవేశ పరీక్ష రుసుము చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.

గిరిజన యువతకు.. ఉచిత శిక్షణ

 భారత దేశ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైకార్ ఎండి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.

 కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభం అవుతుంది అని వెల్లడించారు. రాష్ట్రం యువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తో పాటు ప్లేస్ మెంట్ కల్పిస్తారని వెల్లడించారు.

 ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తుల సమర్పించాలని కోరారు. వివరాలకు Https://dsapponline.com/sds/form/register.php   వెబ్సైట్ సందర్శించాలని సూచించారు

Wednesday, 1 April 2026

ఉచిత అంబలి@ నిజామాబాద్ కలెక్టరేట్

 తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఉచిత తాగు నీటి తో పాటు అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. టీఎన్జీవో సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు..

ఉచిత మెగా జాబ్ మేళా @ మెదక్

 మెదక్ జిల్లాలో ని యువతీ యువకులకు ప్రైవేట్  రంగంలో ఉపాధి కల్పించడం కోసం ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏప్రిల్ 2 వ తేదీన మెదక్ ప్రైవేట్ ఐటిఐ ప్రాంగణంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1-30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైద్రాబాద్ అపోలో ఫార్మసీ లో పని చేయుటకు డి. ఫార్మసీ, బి ఫార్మసీ , ఎం ఫార్మసీ అర్హత ఉన్న వారు అర్హులని అన్నారు.వయసు 18 నుండి 35 మధ్య ఉండాలని ,జీతం 20 వేలవరకు లభిస్తుందని తెలిపారు.25 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు కలవన్నారు.17 వేల వరకు జీతంతో 20 ట్రైనీ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

టెన్త్,ఇంటర్,డిగ్రీ అర్హతలతో 25 ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

బీబీఏ, బీఎస్సీ కెమిస్ట్రీ,న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, అర్హతలతో 5 ప్రొడక్ట్ అడ్వైజర్ ఉద్యోగాలు..17 వేల వరకు జీతంతో..

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో రిటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు ..12 వేల వరకు జీతంతో..

ఆసక్తి,అర్హతలు గల వారు,అనుభవం, ఫ్రెషర్స్ కూడా తగిన విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకొని జాబ్ మేళా కు రావాలని సూచించారు.

మిగతా వివరాలకు 8247656356 నంబర్లో సంప్రదించాలని సూచించారు.



ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

 మన కామారెడ్డి లోని వివేకానంద కాలనీ ఆర్యవైశ్య సంఘం రిజిస్టర్ నెంబర్ 565 కామారెడ్డి వారి ఆధ్వర్యంలో శ్రీకర హాస్పటల్ వారిచే శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ,వివేకానంద కాలనీ, మునిసిపల్ ఆఫీస్ ప్రక్క వీధిలో, కామారెడ్డిలో ఏప్రిల్ 5వ తేదీ 2026న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది 

ఉచిత కన్సల్టేషన్ మరియు చెకప్, ఉచిత మందులు, ఉచిత ఎక్స్ రే చేయబడును. డాక్టర్స్ సలహా మేరకు .

3000 విలువ గల బోన్ మినరల్ డెన్సిటీ పరీక్ష కూడా చేయబడును.

ఒక్క రోజులోనే 38 మోకీలు మార్పిడి చేసిన అనుభవం కలిగిన శ్రీకర హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ కొమురవెల్లి ఎమ్మెస్ తో రోబోటిక్ మోకీలు మార్పిడి ఆర్థోస్కోపీ మరియు ప్రామాణిక నిపుణులు .

వివరాలకు 9000992998 మరియు 9866113630 లలో సంప్రదించండి.

నిర్వాహకులు ..

వలిపీశెట్టి లక్ష్మీరాజం ..అధ్యక్షులు 

తాటిపాముల వెంకటకృష్ణ ..ప్రధాన కార్యదర్శి

 కంకణాల శేఖర్ ..కోశాధికారి

 పాత సత్యం.. గౌరవ అధ్యక్షులు





నృత్యంలో ఉచిత శిక్షణ

 నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...