11, ఆగస్టు 2026, మంగళవారం

ఉచితంగా HPV టీకాల పంపిణీ..

 గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలన లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల కిశోర బాలికల కు" HPV టీకాను ఉచితంగా"  అందిస్తోంది. దేశంలోని అన్ని  జిల్లాల లోని అన్ని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

సరైన అవగాహన లేకుండా ఎంతో మంది స్త్రీలు కాన్సర్ బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని, ఈ అకాల మరణాలను నివారించడానికి, భారత దేశం నుండి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను తరిమి కొట్టడానికి , ఆరోగ్య భారతాన్ని నెలకొల్పడానికి " ఉచిత వాక్సినేషన్ " అద్భుత మార్గమని పేర్కొన్నారు.

కావున ప్రజలు విస్తృత ప్రచారం కల్పించి ,అవగాహన పెంచి " ఉచిత వాక్సినేషన్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఉచిత గుండె శస్త్ర చికిత్స @నిమ్స్, హైద్రాబాద్

 గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ లో పూర్తిగా ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా . రమణ దన్నపనేని , సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థోరాసిక్ సర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి శస్త్ర చికిత్సలు ప్రారంభం కానున్నాయి. వాక్ ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షించి , అవసరమైన వైద్య పరీక్షల అనంతరం సర్జరీ అవసరమున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం , సీ ఎం ఆర్ ఎఫ్ ద్వారా ఉచితంగా చికిత్స అందించనున్నారు. ఐదేళ్లుగా ఏటా ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిమ్స్ తన వార్షిక సోషల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలను అందించనుంది.పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ లు చేయనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.

అర్హత గల చిన్నారుల తల్లి దండ్రులు సోమ వారం నుంచి శని వారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తు లోని సీటీ సర్జరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.

ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ లేకుండానే చిన్నారులతో నిమ్స్ కు రావచ్చని తెలిపారు.

గతంలో చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులు , సంబంధిత పత్రాలు ఉంటే వెంట తీసుకుని రావాలని, మరిన్ని సమగ్ర వివరాలకు 040-23489025 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్.. ఉచిత శిక్షణ

 గ్రామీణ ప్రాంత యువతి యువకులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు , సొంత కాళ్లపై నిలబడాలని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. సోమవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు అందించనున్న ఉచిత వృత్తి విద్యా, నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతి యువకులకు "ఉచితంగా సాంకేతిక, వృత్తి నైపుణ్య శిక్షణ " అందిస్తూ వారిని ఉపాధి వైపు నడిపించేందుకు ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు .

శిక్షణ కాలంలో  అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించడంతోపాటు యూనిఫారం, షూస్ ,బ్యాగ్ తదితర మెటీరియల్ ను ఉచితంగా అందజేస్తారని ఆయన తెలిపారు. కోర్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ఎన్ ఎస్ డి సి గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందించడంతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు .గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కోరారు. 

18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతి యువకులు శిక్షణకు అర్హులని ఆదిలాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారితో పాటు ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఓఏ కంప్యూటర్ ట్రైనింగ్, సోలార్ టెక్నీషియన్, ఆటోమోటివ్- టూ వీలర్, ఫోర్ వీలర్ మెకానిక్, హోటల్ మేనేజ్మెంట్ ,హాస్పిటాలిటీ, ఎలక్ట్రికల్ అండ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, హెల్త్ కేర్- జి డి ఏ, నర్సింగ్ అసిస్టెంట్, బ్యూటీ అండ్ వెల్ నెస్ తదితర కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

 మరిన్ని సమగ్ర వివరాలకు 63036 03145 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్, తుక్కారెడ్డి రాజేందర్ రెడ్డి ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 



9, ఆగస్టు 2026, ఆదివారం

ఉచిత మధుమేహ చికిత్స@ డా. మోహన్స్ డైరెక్ట్

 మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే పెరుగుతాయి.. అనుకుంటాము కానీ కాళ్లకు పుండ్లు , కంటి సమస్యలు ,మూత్రపిండాల సమస్యలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఎదురవుతుంటాయి. అవగాహన ఉన్న వ్యక్తులు అయితే వాటన్నింటినీ గమనించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటారు. మరి పేదవాళ్లు, అవగాహన లేని వారు.. మధుమేహం గురించి సరిగా తెలియక, ఖరీదైన వైద్యం చేయించుకోలేక మరెన్నో సమస్యల బారిన పడుతుంటారు. అలాంటి వారికి ఉచిత మధుమేహ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ వారు " డైరెక్ట్" ను ప్రారంభించారు. 

షుగర్ రోగులు ఎక్కువగా వెళ్ళే ఆసుపత్రులలో డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి ఒకటి. భారతదేశవ్యాప్తంగా 50 కి పైగా శాఖలు ఉన్న ఈ సెంటర్ కు వచ్చే రోగులలో పేదలూ ఉంటారు .అయితే వారు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఇక్కడ జీవితాంతం ఉచితంగా చికిత్స చేయించుకునే వీలు ఉంది. ఒకవేళ షుగర్ వ్యాధి ముదిరి కంటి ఆపరేషన్ తప్పనిసరి అయినా, ఫుట్ అల్సర్ కారణంగా పాదాలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినా అది కూడా ఫ్రీగానే నిర్వహిస్తారు ఇక్కడ. ఆరోగ్యం పైన కాస్త అవగాహన ఉన్నవారు లేదా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారితో పోలిస్తే.. రోజు కూలీలు, పేదలు, గ్రామాల్లో ఉండే వారికి మధుమేహం గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ ఆ లక్షణాలు కనిపించినా వైద్యం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది కనుక నిర్లక్ష్యంగా ఉంటుంటారు, అలాంటివారికి మధుమేహ చికిత్సను ఉచితంగా అందించేందుకు" డాక్టర్ మోహన్స్"  2006 లో "డైరెక్ట్"  డయాబెటిస్ ఇంటర్నేషనల్ రీసర్చ్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించింది. మధుమేహం గురించి అవగాహన కల్పిస్తూనే పరీక్షలు చేయడం, చికిత్స అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, కౌన్సిలింగ్ ఇలా అన్ని రకాల సేవలను ఆ రోగులకు జీవితాంతం అందిస్తుంది ఈ డైరెక్ట్.

మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి జన్మతః వస్తుంది. దానిని టైప్ వన్ డయాబెటిస్ అంటారు. మరొకటి టైప్ టు డయాబెటిస్ ..ఇది ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, వేళకు నిద్రపోకపోవడం, ఒత్తిడి తదితర కారణాలతో మొదలవుతుంది .రెండింటిలో టైప్ వన్ మధుమేహం చికిత్స కాస్త ఖర్చుతో కూడుకుంది. వారు జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూ, నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. అదే టైప్ టు ని తీసుకుంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పులు చేసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ రెండింటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కళ్ళతో పాటు మూత్రపిండాల పైన కూడా ప్రభావం పడుతుంది. కాళ్లకు దెబ్బ తగిలి చిన్న గాయమైనా పుండుగా మారి ఒక పట్టాన తగ్గక ఆపరేషన్ వరకు వెళ్లాల్సి రావచ్చు. పేదలకు, పల్లె ప్రజలకు ఇవన్నీ పెద్దగా తెలియవు కనుక" డైరెక్ట్ " మధుమేహం గురించి తెలియజేస్తూనే వారికి ఉచిత పరీక్షలను నిర్వహిస్తుంది. సమస్య ఉందని తేలితే మందులను లేదా ఇన్సులిన్ కిట్ ను అందిస్తుంది. షుగర్ లెవెల్స్ ను అంచనా వేసే గ్లూకోజ్ సెల్ఫ్ మానిటరింగ్ మిషన్ తో పాటు అవసరమైన వారికి ఇన్సులిన్ పంప్స్ ను ఇస్తారు. ఇప్పటివరకు తమిళనాడులోని కాంచీపురం లో ఐదు గ్రామాలు ,చూనంపేట్ చుట్టుపక్కల 14 గ్రామాలు కలిపి దాదాపు 15 వేల మంది మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉచిత చికిత్సను అందించే ప్రయత్నం చేస్తోంది" డైరెక్ట్" . 

అదే సమయంలో టైప్ వన్ డయాబెటిస్ బారిన పడిన 600 మందికి పైగా బాల నేరస్తులకు ఉచిత ఇన్సులిన్ కిట్స్ పంపిణీ చేసింది. హైదరాబాదులోనూ టైప్ వన్ బాధితులను గుర్తించి ఇన్సులిన్ అందిస్తోంది .వీటితో పాటు  చికిత్స విషయంలో సందేహాలు ఉన్నవారు తరచు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా మొబైల్ టెలి మెడిసిన్ సేవలను ప్రారంభించింది. అంటే" డైరెక్ట్"  సిబ్బంది రోగులకు నిత్యం అందుబాటులో ఉంటారు. అదే సమయంలో ఆ నిర్వాహకులు స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను, యువతను వాలంటీర్లుగా మార్చి వారి ద్వారా మధుమేహ బాధితులు తీసుకోవలసిన పోషకాహారం ,జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల పైన అవగాహన కల్పించేలా ప్రోత్సహిస్తున్నారు.

 మధుమేహానికి ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదన్న ఆలోచనతోనే డైరెక్ట్ ను ప్రారంభించాము, మధుమేహం కారణంగా కళ్ళూ లేదా పాదాలకు ఆపరేషన్లను ఆసుపత్రుల్లోనే ఉచితంగా చేస్తూ, వారు పూర్తిగా కోలుకునే వరకు మేము పర్యవేక్షిస్తాం అనే డాక్టర్ వి మోహన్ ఇందుకోసం డయాబెటాలజిస్టులు, నర్సులు, డైటీషియన్లు, టెక్నీషియన్లు, సర్జన్లు, కౌన్సిలర్లతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక పేదల ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాలు, నెలసరి ఆదాయం వంటివన్నీ అంచనా వేశాకే ఉచిత చికిత్సను అందించే " డైరెక్ట్ "  టెలీ మెడిసిన్ తో పాటు తమిళనాడులోని డాక్టర్ మోహన్స్ ఆసుపత్రి లో "ఎం విశ్వనాథన్ ఫ్రీ డయాబెటిస్ క్లినిక్ " అనే పేరుతో ఒక క్లినిక్ ను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఈ సేవలను అందిస్తున్న" డైరెక్ట్"  కర్ణాటక, కేరళ, ఒడిశా ,పుదుచ్చేరి.. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలలో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 



8, ఆగస్టు 2026, శనివారం

సాధారణ ప్రజలకు.. యూ పీ ఐ సేవలు ఉచితమే

 చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజానీకం పై ఎలాంటి భారం పడదని , యూపీఐ చెల్లింపులు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజల సందేహాలకు స్పష్టత ఇస్తూ.. చెల్లింపుల చట్టంలోని సెక్షన్ 10 ఏ ను సవరించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలకు చట్ట బద్ధత కల్పిస్తున్నామన్నారు. 

ఈ  ఎం డీ ఆర్ ఛార్జీలు కేవలం రూ 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులకు , అది కూడా రూ. 2000 పై బడిన లావాదేవీలపై 0.3% నుండి 0.5% వరకు మాత్రమే విధించే ఆలోచన ఉందని ఆమె తెలిపారు. 

అగ్నివీర్ ఉత్తీర్ణులకు "ఉచిత ఫిజికల్ కోచింగ్"

 తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి మండలం తోపాటు కామారెడ్డి జిల్లా కు చెందిన అగ్నివీర్ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులైన యువతకు ఫిజికల్ ట్రైనింగ్ కోసం అరుదైన అవకాశం కల్పిస్తున్నట్లు " సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ (ఎస్ వై ఎం ఎస్) కామారెడ్డి జిల్లా ఇంచార్జి, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేమె రాజిరెడ్డి గారు తెలిపారు . అగ్నివీర్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి జరిగే ఫిజికల్ పరీక్షలకు మెరుగైన శిక్షణ పొందేందుకు ఎస్ వై ఎం ఎస్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ అందించ నున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

హన్మకొండ లోని రామప్ప డిఫెన్స్ & జూనియర్ కళాశాల యాజమాన్యం , సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ చేస్తున్న సేవలను గుర్తించి ,తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు 70 మంది అగ్నివీర్ ఉత్తీర్ణులకు" ఉచితంగా ఫిజికల్ కోచింగ్ " అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 94942 60214 మొబైల్ నెంబర్ లో సంప్రదించాలని కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీ దేమె రాజిరెడ్డి గారు పేర్కొన్నారు.

6, ఆగస్టు 2026, గురువారం

మైనారిటీ స్టడీ సర్కిల్ లో ఉచిత శిక్షణ లు

 తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన మైనారిటీ లకు వివిధ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం పోలీస్ శాఖ లోని వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD యాకూబ్ పాషా తెలిపారు. 

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల  చేశారు.SI పోస్టులకు 50 మంది, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 మందిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నామని ఆయన తెలిపారు. 

పూర్తి సమగ్ర వివరాలకు..

85208 60785, 040-23236112, 90590 50062 నంబర్ లలో సంప్రదించాలని ఆయన సూచించారు. 

వదిరాజా భట్ @ ఓ శాట్..

 వదిరాజా భట్ కర్ణాటక కు చెందిన ఐటీ నిపుణుడు . పాతికేళ్ల కిందటే అక్కడో కంపెనీ స్థాపించాడు. అమెరికాలో స్థిరపడిన వాళ్లందరిలాగే సొంతూరికీ అయిన వ...